Andhra Bank Stopped Vijay Devarakonda’s Account Due To Not Maintaining A Minimum Balance!

విజయ్ దేవరకొండ అకౌంట్‌ను లాక్ చేసిన ఆంధ్రా బ్యాంక్
అవును. ఫోర్బ్స్ ఇండియా ’30 అండర్ 30′ లిస్ట్‌లో తాజాగా చోటు సంపాదించిన యూత్ హార్ట్ త్రోబ్ విజయ్ దేవరకొండ అకౌంట్‌ను ఆంధ్రా బ్యాంక్ నిలిపివేసింది. కారణం అందులో మినిమం బ్యాలెన్స్‌ను మెయిన్టైన్ చెయ్యకపోవడం!
కాకపోతే అదిప్పటి సంగతి కాదు. నాలుగేళ్ల క్రితం సంగతి. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపాడు విజయ్. తనను 2019 ’30 అండర్ 30′ జాబితాలో ఫోర్బ్స్ ఇండియా నిలపడంపై స్పందించాడు.
“అప్పుడు నా వయసు 25. ఆంధ్రా బ్యాంక్‌లో రూ. 500 మినిమం బ్యాలెన్స్ మెయిన్టైన్ చెయ్యకపోతే లాక్ చేసిన్రు అకౌంట్. 30 ఏళ్ల లోపు సెటిల్ అవ్వమని డాడీ చెప్పారు. అలా అయితే నువ్వు కుర్రాడిగా ఉన్నప్పుడే, తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీ విజయాన్ని నువ్వు ఆస్వాదించగలుగుతావు అని చెప్పారు. నాలుగేళ్ల తర్వాత – ఫోర్బ్స్ సెలబ్రిటీ 100, ఫోర్బ్స్ 30 అండర్ 30” అని భావోద్వేగంతో ట్వీట్ చేశాడు విజయ్.
అభిమానుల నుంచి ఆ ట్వీట్‌కు చాలా మంచి స్పందన వచ్చింది.