Anushka Looks Chic And Slim In New Photos


Anushka Looks Chic And Slim In New Photos
Anushka Shetty

స్వీటీ సన్నబడింది!

2018 మొదట్లో వచ్చిన హారర్ సినిమా ‘భాగమతి’తో ఘన విజయం సాధించింది అనుష్క. సూపర్ హీరోయిన్‌గా తన సత్తా మరోసారి చాటింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా రూ. 27 కోట్ల షేర్ పైగా సాధించింది.

అయితే ఆ సినిమా తర్వాత ఒక్క కార్తికేయ (రాజమౌళి కుమారుడు) పెళ్లిలోనే ఆమె దర్శనమిచ్చింది. ఇంకెక్కడా అనుష్క కనిపించలేదు. కారణం వెయిట్ లాస్ కోసం అమెరికాకు వెళ్లడమే. ఇప్పుడు బరువు తగ్గిన ఆమె తిరిగొచ్చింది. ఆమె తాజా ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

వైట్ డ్రెస్‌లో సముద్రం ఒడ్డున రాళ్లపై కూర్చొని ఆమె తీయించుకున్న ఫొటో షూట్ ఆమె స్లింగా, మరింత లావణ్యంగా తయారయ్యిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఫొటో షూట్‌ను సుందర్ రాము చేశారు. ఆమెను అలా చూసి అభిమానులు ఆనందపడిపోతున్నారు. కాగా, కోన వెంకట్ నిర్మిస్తున్న సినిమాలో మాధవన్‌తో కలిసి నటించడానికి సిద్ధమవుతోంది స్వీటీ.

Anushka Looks Chic And Slim In New Photos