Aquaman Sequel In The Works


Aquaman Sequel In The Works

‘ఆక్వామ్యాన్’ సీక్వెల్ పనులు మొదలయ్యాయి

సుమారు రెండు నెలల క్రితం విడుదలైన ‘ఆక్వామ్యాన్’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. బిల్లియన్ డాలర్లకు పైగా ఆర్జించింది. ఇప్పుడు ఈ సినిమా నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ దాని సీక్వెల్ పనులను మొదలుపెట్టింది. తొలి చిత్రానికి సహ రచయిత అయిన డేవిడ్ లెస్లీ జాన్సన్-మెక్‌గోల్డ్రిక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

తొలి సినిమా దర్శకుడు, ‘ద కంజూరింగ్ 2’కు జాన్సన్-మెచ్‌గోల్డ్రిక్‌తో కలిసి పనిచేసిన జేమ్స్ వాన్ ఒక నిర్మాతగా డీల్ కుదుర్చుకుంటున్నాడు. ఇంకో నిర్మాతగా పీటర్ సఫ్రాన్ ఎటు తిరిగీ ఉన్నాడు. ఈ సీక్వెల్‌కి కూడా జేమ్స్ వాన్ దర్శకత్వం చేపడతాడా, లేదా అనే విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.

జాసన్ మమోవా టైటిల్ రోల్ చేయగా డిసెంబర్‌లో విడుదలైన ‘ఆక్వామ్యాన్’ ప్రపంచవ్యాప్తంగా 1.12 బిలియన్ డాలర్లను వసూలు చేసింది. 2012లో వచ్చిన ‘ద డార్క్ నైట్ రైజెస్’ తర్వాత 1 బిలియన్ డాలర్లను వసూలు చేసిన వార్నర్ బ్రదర్స్ సినిమా ఇదే.

‘ఆక్వామ్యాన్’ స్క్రిప్ట్‌ను ‘గ్యాంగ్‌స్టర్ స్క్వాడ్’ ఫేం విల్ బీల్‌తో కలిసి రాశాడు జాన్సన్-మెక్‌గోల్డ్రిక్. కథను జేమ్స్ వాన్, జెఫ్ జాన్స్‌తో కలిసి విల్ బీల్ అందించాడు. తెలుగులోనూ ఈ సినిమా అనువాదమై ఘన విజయం సాధించింది.