Arya & Sayyeshaa Confirm Their Wedding


మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నామంటూ ఆర్య, సయేషా సైగల్ ట్విట్టర్ సాక్షిగా అధికారికంగా ప్రకటించేశారు. ఈ ప్రకటన చేయడానికి వాలెంటైన్స్ డేని మించిన రోజు మరొకటి ఉండదు. కాగా, ఈ విషయంపై actioncutok ముందుగానే సమాచారం అందించింది. ఆ కథనాన్ని మీకోసం మరోసారి అందిస్తున్నాం. అందుకోసం, ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.

సయేషాను పెళ్లాడనున్న ఆర్య

‘మా తల్లిదండ్రులు, కుటుంబం దీవెనలతో మా జీవితంలోని ఓ అందమైన రోజును మీతో షేర్ చేసుకుంటున్నందుకు ఆనందిస్తున్నాం. మేము మార్చి నెలలో వివాహం చేసుకోబోతున్నాం. మేమిద్దరం కొత్త ప్రయాణాన్ని సాగించేందుకు ఒక్కటవుతున్న సందర్భంగా మీ ప్రేమ, దీవెనలు కోరుకుంటున్నాం’ అనేది వీరి ట్వీట్ సారాంశం.