‘డియర్ కామ్రేడ్’ విడుదల ఎప్పుడు?


'డియర్ కామ్రేడ్' విడుదల ఎప్పుడు?

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఏక కాలంలో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి – భరత్ కమ్మ దర్శకత్వంలో చేస్తోన్న ‘డియర్ కామ్రేడ్’, రెండు – క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో చేస్తోన్న పెరుపెట్టని సినిమా.

‘డియర్ కామ్రేడ్’లో విజయ్ విద్యార్థి నాయకుడిగా కనిపించబోతున్నాడు. ఆ సినిమా షూటింగ్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేగంగా జరుగుతోంది. యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే ఆ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. దానితో పాటు కొత్త పోస్టర్‌నూ విడుదల చేయనున్నారు. మే నెలలో ‘డియర్ కామ్రేడ్’ను విడుదల చేయాలనేది నిర్మాతల సంకల్పం.

‘డియర్ కామ్రేడ్’లో విజయ్ సరసన రష్మిక మండన్న నటిస్తుండగా, మరో కీలక పాత్రను మలయాళ తార శ్రుతి రామచంద్రన్ చేస్తోంది. ఆమెకు ఇదే తొలి తెలుగు చిత్రం. విద్యార్థి రాజకీయాల నేపథ్యంలో యాక్షన్ ఫిలింగా తయారవుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది.

ఈ సినిమాని బిగ్ బెన్ సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు సంయుకంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాతో తమిళ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు.

Related articles: