Dubbing Begins For Mahesh’s Maharshi


Dubbing Begins For Mahesh's Maharshi

‘మహర్షి’ డబ్బింగ్ పనులు మొదలైపోయాయ్

మహేశ్ టైటిల్ రోల్ చేస్తున్న ‘మహర్షి’ని అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సకల ఏర్పాట్లూ చేస్తున్నారు నిర్మాతలు. అందులో భాగంగా డబ్బింగ్ పనులు గురువారం మొదలయ్యాయి. దీనికి సంబంధించి డబ్బింగ్ థియేటర్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, నటుడు అల్లరి నరేశ్, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఇందులో మహేశ్ స్నేహితుడిగా నరేశ్ నటిస్తున్నాడు. మొదటగా అతను తన పాత్రకు డబ్బింగ్ చెప్పాడు.

పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ సినిమాని సి. అశ్వనీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండో టీజర్ ఎప్పుడొస్తుందా.. అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 6న రెండో టీజర్‌ను తీసుకు వస్తారని సమాచారం. ఈ లోగా షూటింగ్ పూర్తి చేయనున్నారు.

గతంలో మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ టీజర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ టీజర్‌లో చేతిలో ల్యాప్‌టాప్ పట్టుకొని కాలేజీలో నడుచుకుటూ వెళ్తూ స్టూడెంట్ గెటప్‌లో రిషిగా మహేశ్ కనిపించాడు.

ఏప్రిల్ 25న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, జగపతిబాబు, రావి రమేశ్, సాయికుమార్, నరేశ్, జయసుధ, నవీన్ చంద్ర, సోనాల్ చౌహాన్ తారాగణమైన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. కె.యు. మోహనన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు.

Dubbing Begins For Mahesh's Maharshi