Fight Master Raju’s Wife Blames That Chiranjeevi Completely Forgot Her Husband


Fight Master Raju's Wife Blames That Chiranjeevi Completely Forgot Her Husband
Fight Master Raju’s Wife Blames That Chiranjeevi Completely Forgot Her Husband

చిరంజీవిగారు కూడా మమ్మల్ని మరచిపోయారు: ఫైట్‌మాస్టర్ రాజు భార్య

ఫైట్‌మాస్టర్ రాజు.. తెలుగులో ఎంతోమంది అగ్ర నటులకు యాక్షన్ సన్నివేశాలను రూపకల్పన చేసి, వాళ్లు యాక్షన్ హీరోలుగా పేరు తెచ్చుకోవడంలో వెనకున్న వ్యక్తి. ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, రజినీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి హీరోలకు ఆయన ఎన్నో సినిమాల్లో ఫైట్లు సమకూర్చారు. చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడంలో కీలక పాత్ర పోషించినవి ఫైట్లే. అందరికంటే చిరంజీవి చిత్రాలకే ఎక్కువగా పని చేశారు రాజు. ఆ రోజుల్లో చిరంజీవి – రాజు కాంబినేషన్ అంటే ఎంతో క్రేజ్. ఇవాళ టాప్ ఫైట్‌మాస్టర్లయిన రాం-లక్ష్మణ్ ఆయన శిష్యులే. అలాంటి ఆయన చనిపోయి తొమ్మిదేళ్లయింది. ఆయనను స్మరించుకొనేవాళ్లు కానీ, ఆయన కుటుంబాన్ని పట్టించుకొనేవాళ్లు కానీ చిత్రసీమలో ఎవరూ లేరు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా వేటపాలెం. ప్రస్తుతం ఆయన భార్య రామిశెట్టి అనంతలక్ష్మి అక్కడే నివాసం ఉంటున్నారు. చిత్రసీమకు తన భర్త ఎన్నో సేవలు అందించినా ఆయనను తలచుకొనేవాళ్లు లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవి సహా ఏ హీరో కూడా పట్టించుకోలేదని వాపోయారు. ప్రభుత్వం కూడా తమను విస్మరించిందన్నారు. ఇటీవల రాజు స్వగృహంలో ఆయన 67వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి మాట్లాడారు.

“నా భర్త రాజు మాస్టర్ చనిపోయి తొమ్మిది సంవత్సరాలైనా ఇండస్ట్రీ కానీ, ఆంధ్ర రాష్ట్రం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాజు మాస్టర్‌ని ఒక వర్కర్‌గా ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదు. భాషా సమస్య వస్తే నా భర్త చెన్నై నుంచి  హైదరాబాద్ వచ్చి ఇక్కడ యూనియన్ పెట్టారు, యూనియన్ బిల్డింగ్ కట్టిచ్చారు, వర్క్ నేర్పించారు, మంచి శిష్యులనిచ్చారు. ఎవరూ మాకు ఫండ్స్ కానీ, ఆర్థిక సాయం కానీ చెయ్యలేదు. ఏ హీరోలూ కానీ, ఇండస్ట్రీలో ఎవరూ రాజు మాస్టర్‌ను గుర్తించలేదు. చిరంజీవి గారికి ఫైట్లలో రాజుగారే ట్రైనింగ్ ఇచ్చారు. రాజుగారు చేసిన ఫైట్ల వల్లే చిరంజీవిగారు ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఆయన కూడా మమ్మల్ని పట్టించుకోకపోవడం బాధ కలిగిస్తోంది” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Fight Master Raju's Wife Blames That Chiranjeevi Completely Forgot Her Husband