Jr NTR Back From Dubai Trip


Jr NTR Back From Dubai Trip
Jr NTR

దుబాయ్ నుంచి తిరిగొచ్చిన జూనియర్ ఎన్టీఆర్

భార్యా పిల్లలతో కలిసి దుబాయ్ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్, అక్కడ ఆరు రోజులు గడిపి ఆదివారం హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. రెండు పనుల నిమిత్తం ఆయన దుబాయ్ వెళ్లాడు. ఒకటి – కుటుంబంతో కొద్ది రోజుల పాటు సెలవులు గడపడం, రెండు – ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో తన కేరెక్టర్‌కు సంబంధించిన కొన్ని కాస్ట్యూమ్స్‌ను సెలెక్ట్ చేసి తీసుకురావడం.

ఫిబ్రవరి 11న వెళ్లిన ఆయన ఈ రెండూ పూర్తి చేసుకొని వచ్చాడు. ఇప్పటికే రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న షూటింగ్‌లో సోమవారం నుంచి పాల్గొననున్నాడు. కాగా ఈ సినిమాలో ఆయన ఇప్పటివరకూ కనిపించని రగ్డ్ లుక్‌లో కనిపించనున్నట్లు అంతర్గత వర్గాల సమాచారం.

తీర్చిదిద్దినట్లుండే శరీరాకృతికి కోసం తన ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో కష్టపడుతున్నాడు. దొంగ, పోలీస్ కేరెక్టర్లు చేసున్న జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌పై ఏప్రిల్లో ఒక యాక్షన్ సీక్వెన్స్‌ను తీయనున్నారు. ఆ ఫైట్‌లో ఇద్దరు హీరోలూ చొక్కాలు లేకుండా కనిపిస్తారని వినికిడి. ప్రస్తుతం ఆ ఇద్దరి సరసన నటించే తారల కోసం అన్వేషణ కొనసాగుతోంది.