Krishna’s Heroine Turns Modi’s Mother


Krishna's Heroine Turns Modi's Mother
Zarina Wahab

మోదీ తల్లి పాత్రలో కృష్ణ హీరోయిన్!

నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ‘పిఎం నరేంద్ర మోది’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘మేరీకోం’ ఫేం ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్ పోషిస్తున్నాడు.

వివేక్ తండ్రి, సుప్రసిద్ధ నటుడు సురేశ్ ఓబరాయ్, సందీప్ సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మోదీ భార్య, తల్లి పాత్రధారులను ఎంపిక చేశారు. భార్య యశోదా బెన్ పాత్రలో హిందీ టీవీ సీరియల్స్‌తో పాపులర్ అయిన బర్ఖాబిస్త్ సేన్ గూప్తా నటిస్తుండగా, తల్లి హీరా బెన్ పాత్రకు సీనియర్ తార జరీనా వహాబ్‌ను ఎంపిక చేశారు.

ఒకప్పుడు అనేక హిందీ సినిమాల్లో అగ్ర హీరోల సరసన నాయికగా నటించిన జరీనా తెలుగులోనూ సూపర్‌స్టార్ కృష్ణ జోడీగా ‘గాజుల కిష్టయ్య’ (1975)లో నటించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు సరసన ‘హేమా హేమీలు’ సినిమాలో చేశారు. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు.

మోదీ బయోపిక్‌ను 23 భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.