Lovers Day: The Priya Prakash Varrier Starrer Is All Set For Release On 14 February


Lovers Day: The Priya Prakash Varrier Starrer Is All Set For Release On 14 February
Lovers Day: The Priya Prakash Varrier Starrer Is All Set For Release On 14 February

లవర్స్ డే: ఫిబ్రవరి 14 విడుదల

ప్రియా ప్రకాశ్ వారియర్, రోషన్ జంటగా నటించిన ‘లవర్స్ డే’ సినిమా విడుదలకు సిద్ధమైంది. మలయాళంలో ఒమరు లులు డైరెక్ట్ చేసిన ‘ఒరు అడార్ లవ్’ సినిమాకు ఇది తెలుగు డబ్బింగ్ వెర్షన్. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, మలయాళంతో పాటు తమిళ, కన్నడ భాషల్లోనూ ఏక కాలంలో ఈ సినిమా విడుదలవుతోంది. వాస్తవానికి ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ కావాల్సింది. ప్రియా వారియర్ కన్ను కొడుతున్నట్లు విడుదల చేసిన ట్రైలర్‌కు వచ్చిన అనూహ్య స్పందన, ప్రియకు వచ్చిన క్రేజ్ చూసి డైరెక్టర్ మళ్లీ స్క్రిప్టులో మార్పులు చేసి, రీషూట్ చేశాడు. నిజానికి మొదట ప్రియా వారియర్, రోషన్‌లను రెండో జంటగా ఎంచుకున్నాడు దర్శకుడు. ప్రధాన జంటగా నూరిన్ షరీఫ్, అనీశ్ మీనన్‌లను తీసుకున్నాడు. కానీ తర్వాత రెండు జంటలకూ సమ ప్రాధాన్యం ఇస్తూ సినిమాని మార్చాడు.

సుఖీభవ సినిమాస్ బేనర్‌పై తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న ఎ. గురురాజ్, సిహెచ్. వినోదరెడ్డి మాట్లాడుతూ “ఆడియో రిలీజ్ తర్వాత ప్రియా ప్రకాశ్ వారియర్ కు టాలీవుడ్‌లో క్రేజ్ మరింత పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను తెలుగు ప్రేక్షకులకి  దగ్గరగా చేసేందుకు, ప్రేక్షకులకు సంపూర్ణమైన వినోదాన్ని అందించేందుకు ప్రీ ప్రోడక్షన్ పనులను క్వాలిటీతో రూపొందించాం. ప్రియా వారియర్‌కు తెలుగులో ఉమ (ప్రముఖ దర్శకుడు రేలంగి నర్సింహారావు తమ్ముడి  కూతురు), ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా చేసిన నూరిన్‌కు సింగర్ లిప్సిక డబ్బింగ్ చెప్పారు. చిత్రంలో మొత్తం ఎనిమిది పాటలు ఉన్నాయి. గీత రచయితలు చంద్రబోస్, చైతన్య ప్రసాద్, శివ గణేష్, శ్రీజో, శ్రీ సాయికిరణ్ సాహిత్యాన్ని అందించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా లవర్స్ డే చిత్రాన్ని ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం” అని తెలిపారు.

Lovers Day: The Priya Prakash Varrier Starrer Is All Set For Release On 14 February
Lovers Day: The Priya Prakash Varrier Starrer Is All Set For Release On 14 February