Mallesham: First Look Of A Handloom Weaver’s Biopic Revealed


Mallesham: First Look Of A Handloom Weaver's Biopic Revealed
Mallesham: First Look Of A Handloom Weaver’s Biopic Revealed

‘మల్లేశం’గా ప్రియదర్శి

చేనేత కార్మికురాలైన అమ్మ లక్ష్మి కోసం ఆసు యంత్రాన్ని కనిపెట్టిన చింతకింది మల్లేశం 2017లో పద్మశ్రీ అవార్డు సైతం అందుకున్నారు. ఆరో తరగతిని మధ్యలోనే ఆపేసి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని చుట్టుపక్కల వాళ్లలో స్ఫూర్తినింపే స్థాయికి ఎదిగిన ఆయన కథ వెండితెరకి ఎక్కుతోంది.

‘మల్లేశం’ పేరుతో రూపొందుతోన్న ఆ సినిమాలో టైటిల్ రోల్‌ను మనకు హాస్యనటుడిగా తెలిసిన ప్రియదర్శి పోషిస్తున్నాడు. నటుడిగా అతనికి ఇది పెద్ద సవాల్. మల్లేశం పాత్రలో అతడ్ని చూపిస్తోన్న దర్శకుడు రాజ్ ఆర్. శ్రీ అధికారితో కలిసి సినిమాని స్వయంగా నిర్మిస్తున్నాడు. ఆ సినిమా ఫస్ట్ లుక్‌ను ఆదివారం విడుదల చేశారు.

కొన్నాళ్ల క్రితం కూతురి కోసం పట్టుచీర నేసివ్వాలనే ఒక చేనేత కార్మికుడి కలను ప్రియదర్శన్ ‘కాంచీవరం’ పేరుతో వెండితెరపై ఆవిష్కరించారు. ఆ తమిళ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్ర పోషించాడు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డునూ అందుకున్నాడు.

ఇప్పుడు చేనేత కార్మికుని మరో కోణాన్ని ‘మల్లేశం’లో చూపిస్తున్నాడు దర్శకుడు రాజ్. పేరుపొందిన రచయిత పెద్దింటి అశోక్‌కుమార్ సంభాషణలు, గోరటి వెంకన్న, చంద్రబోస్ పాటలు, ప్రసిద్ధ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే పబ్లిసిటీ డిజైన్ అందించిన ‘మల్లేశం’ చిత్రానికి బాలు శాండిల్యస ఛాయాగ్రాహకునిగా పనిచేశారు. ఈ సినిమా ఎలాంటి పేరు ప్రఖ్యాతులు సాధిస్తుందో చూడాలి.

Mallesham: First Look Of A Handloom Weaver's Biopic Revealed
Chintakindi Mallesham and his mother Lakshmi
Mallesham: First Look Of A Handloom Weaver’s Biopic Revealed