Manchu Manoj Fires On Modi Over AP Special Status

“మోదీ గారూ.. మాట నిలబెట్టుకోకపోతే బాలాజీ ఆగ్రహాన్ని ఎదుర్కొంటారు”
ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ ఇచ్చే విషయంలో నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని ట్విట్టర్ వేదికగా హీరో మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. మోదీకి ఏపీ ప్రజలు ఇంతదాకా మద్దతునిస్తూ వచ్చారనీ, వారి సమక్షంలో, దేవుని సన్నిధిలో స్పెషల్ స్టేటస్ ఇస్తానని చేసిన ప్రమాణం నిలబెట్టుకోకపోతే ఆ దేవుని ఆగ్రహాన్ని చవిచూడక తప్పదనీ ఆయన హెచ్చరించారు. ఓ వైపు మోదీని, మరో వైపు వేంకటేశ్వరస్వామిని ఉంచి ట్విట్టర్లో ఆయన చేసిన పోస్ట్ చాలా మందిని ఆకర్షిస్తోంది. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మీ పోరాటంలో మేం మీతో నిల్చున్నాం.. మా అవసరం వచ్చినప్పుడల్లా మీకు మద్దతునిచ్చాం.. మీ ప్రామిస్ నెరవేరుస్తారని ఎదురు చూశాం. మీ నుంచి కృతజ్ఞత కానీ, స్పెషల్ స్టేటస్ కానీ రాలేదు. ఇదే సమయం. మా చిన్న డిమాండ్‌ను గౌరవించి, మా గ్రేట్ ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి. లేదా మీరు ప్రమాణం చేసిన బాలాజీ దేవుడి ఆగ్రహాన్ని ఎదుర్కోండి” అని పోస్ట్ చేశారు మనోజ్.