Naga Jhansi Suicide Case: Lover Taken Into Police Custody

Naga Jhansi Suicide Case: Lover Taken Into Police Custody
Naga Jhansi

పోలీస్ కస్టడీకి నాగఝాన్సీ ప్రియుడు

కోర్టు అనుమతితో టీవీ తార నాగఝాన్సీ కేసులో ఆమె ప్రియుడు సూర్యతేజను పంజాగుట్ట పోలీసులు శనివారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే అతను అరెస్టయి జైలులో ఉన్నాడు.

నాగఝాన్సీ ఆత్మహత్య చేసుకోవడానికి వెనకున్న వాస్తవాల్ని తెలుసుకొనే క్రమంలో సూర్యతేజను విచారించాలని భావిస్తున్న పోలీసులు అందులో భాగంగా కోర్టును ఆశ్రయించారు. అతడిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరారు. కోర్టు అనుమతించడంతో తమ అదుపులోకి తీసుకొని విచారించడం మొదలుపెట్టారు.

అదివరకు ప్రేమించిన అతను మోసం చేసినందువల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ నాగఝాన్సీ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు ఫిబ్రవరి 12న సూర్యతేజను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చగా, కోర్టు అతడికి రిమాండ్ విధించింది.

ఇప్పుడు తిరిగి అతడిని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు ఝాన్సీని అతడు దూరం పెట్టడం వెనుక కారణాలను తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.