Nani Reportedly Play Negative Role In Sudheer Babu Film


Nani Reportedly Play Negative Role In Sudheer Babu Film
Nani

నెగటివ్ రోల్‌లో నాని!

ఇటీవల పాత్రలతో ప్రయోగాలు చేస్తున్నాడు నాని. ఒక వైపు హీరోయిజం ఉన్న పాత్రలు, ఇంకోవైపు అమాయకత్వం నిండిన పాత్రలు చేస్తూనే, హీరో కాని పాత్రలు చేయడానికీ ముందుకు వస్తున్నాడు. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ‘నిన్ను కోరి’లో చేసిన ఉమామహేశ్వరరావు అలియాస్ ఉమ పాత్ర అందుకో ఉదాహరణ.

అదే తరహాలో ఇప్పుడు ఒక నెగటివ్ రోల్ చేయడానికి సిద్ధమవుతున్నాడని వినిపిస్తోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో అతడు ఈ పాత్రను చేయనున్నాడనేది సమాచారం. ఇందులో సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్నాడు.

సుధీర్‌తో ఇది మోహనకృష్ణకు వరుసగా రెండో సినిమా. దీనికి ముందు వారి కాంబినేషన్‌లో వచ్చిన ‘సమ్మోహనం’ ఎలాంటి మంచి పేరు తెచ్చుకుందో తెలిసిందే. ఆ సినిమాతో మోహనకృష్ణ హ్యాట్రిక్ సాధించాడు కూడా. దాని కంటే ముందు ఆయన రూపొందించిన ‘జెంటిల్‌మన్’, ‘అమీ తుమీ’ సినిమాలు హిట్టయ్యాయి.

కాగా నానితో మోహనకృష్ణకు మంచి అనుబంధం ఉంది. వాళ్ల కాంబినేషన్‌లో ‘అష్టా చమ్మా’, ‘జెంటిల్‌మన్’ సినిమాలు వచ్చాయి. మోహనకృష్ణ చెప్పిన కేరెక్టర్ బాగా నచ్చే, అది చెయ్యడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో సుధీర్‌బాబు పోలీసాఫీసర్ రోల్ చేస్తున్నాడు. మరి నాని రోల్ ఏమిటన్నది చూడాలి.