Nee Kosam Song Launch By Raj Kandukuri


రాజ్ కందుకూరి చేతుల మీదుగా ‘నీ కోసం’ రెండో పాట విడుదల

ప్రేమ కథలకు సీజన్ ఉండదు. మనసు పెట్టి చేసిన కథలు ప్రేక్షకుల మనసును గెలుచుకుంటాయి. ఆ నమ్మకాన్ని కలిగిస్తున్న సినిమా నీకోసం. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రం ‘నీ కోసం’. రెండు జంటల మధ్య ప్రేమకథను ఈ తరానికి నచ్చేలా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలయిన ఈ చిత్ర టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

నీకోసం చిత్రంలోని తొలి పాటను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా విడుదల చేయగా.. ఆ పాటకు మంచి స్పందన వచ్చింది.

పెళ్లిచూపులు తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కందుకూరి ‘నీకోసం’ రెండో పాట ‘మొదలయ్యింది ఇలా ఎలా’ పాటను విడుదల చేసారు. న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా ఈ మూవీ లుక్ ఉందని ప్రశంసించారు.

ఇది ప్రేమకథే అయినా అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టునే విధంగా తీశారు. తీర్థసాయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అల్లూరమ్మ(భారతి) నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అవినాష్ కోకటి దర్శకుడు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి వచ్చే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది చిత్ర యూనిట్.

ఈ చిత్రంలో అరవింద్ రెడ్డి, శుభాంగి పంత్, అజిత్ రాధారామ్, దీక్షిత ప్రధాన జంటలుగా నటిస్తుండగా.. కమెడియన్ సుదర్శన్, ఈ రోజుల్లో సాయి, కేధార్ శంకర్, పూర్ణిమ, కల్పలత, మహేష్ విట్టా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం : శ్రీనివాస్ శర్మసినిమాటోగ్రఫీ : శివకృష్ణ,ఎడిటర్ : తమ్మిరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : తేజేశ్వరి అన్నపురెడ్డి, ఆర్ట్ : క్రాంతి ప్రియం, పి.ఆర్.ఓ : జి.ఎస్.కె. మీడియా, పబ్లిసిటీ డిజైనర్ : రాజాజీ డిజైన్స్, సహ నిర్మాతలు : సోమశేఖర్ రెడ్డి మరియు అల్లూరిరెడ్డి.ఏ, నిర్మాత : అల్లూరమ్మ(భారతి), రచన, దర్శకత్వం: అవినాష్ కోకటి.

Nee Kosam Song Launch By Raj Kandukuri