NTR Mahanayakudu Reviews: 8 Early Recoils You Must See

యన్.టి.ఆర్ మహానాయకుడు సమీక్షలు: మనం చూడాల్సిన 8 తక్షణ విమర్శలు
ఒక సినిమా విడుదలైన వెంటనే కొన్ని తక్షణ స్పందనలు వస్తాయి. వాటిలో నెగటివ్ రియాక్షన్సే ఎక్కువగా ఉంటాయి. ఎన్టీఆర్ బయోపిక్‌లో రెండో భాగమైన ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ విషయంలోనూ సమీక్షకుల నుంచి వెంటనే వినిపించిన కొన్ని విమర్శలేంటో చూద్దామా…
1. సినిమా మరీ సీరియస్ టోన్‌లో ఉంది. ఎన్టీఆర్, బసవతారకం మధ్య సన్నివేశాల్లో అవసరమైన గాఢత లోపించింది.
2. ఎమోషనల్ కనెక్షన్ లోపించింది. క్లైమాక్స్ బలహీనంగా ఉంది.
3. దివంగతుడైన ఎన్టీఆర్ కథని మధ్యలోనే ఆపేయడం అన్యాయం.
4. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడని పేరు తెచ్చుకున్న చంద్రబాబునాయుడును ఎన్టీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడైన అల్లుడిగా చూపించే ప్రయత్నం చేశారు.
5. సినిమా నిడివి 2 గంటల 8 నిమిషాలే అయినా కథనాన్ని సాగదీసినట్లు అనిపించింది. కథను కూడా తమ సౌకర్యానికి తగ్గట్లు మలుచుకున్నారు.
6. నాదెండ్ల భాస్కరరావును పెద్ద విలన్‌గా చిత్రీకరించడం, మునిగిపోతున్న టీడీపీని చంద్రబాబు ఒడ్డున చేర్చారని చూపడం పూర్తిగా ఏకపక్షంగా చరిత్రను వక్రీకరించడమే.
7. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాల్లో ఒక్కటి మాత్రమే చూపించించి, మిగతావాటిని ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారు. 1994లో టీడీపీ అఖండ విజయం సాధించి, ఎన్టీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయిన సంఘటనను విస్మరించారు.
8. ఇది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, టీడీపీకి లబ్ధి చేకూర్చడానికి తీసిన సినిమా.