One Fight That Must Happen On 1 March


One Fight That Must Happen On 1 March
Stills from 118 and ABCD movies

మార్చి 1న ‘ఏబీసీడీ’ వర్సెస్ ‘118’

మార్చిలో రెండు మీడియం బడ్జెట్ సినిమాలు ఒకే రోజున విడుదలవుతూ బాక్సాఫీస్ దగ్గర పోటీపడబోతున్నాయి. సందర్భవశాతూ ఆ రెండు సినిమాలు అగ్ర హీరోల సోదరుల సినిమాలు కావడం గమనించదగ్గ అంశం. వాటిలో ఒకటి నందమూరి క‌ల్యాణ్ రామ్ సినిమా ‘118’ కాగా, మరొకటి అల్లు శిరీష్ సినిమా ‘ఏబీసీడీ’.

One Fight That Must Happen On 1 March
Still from 118 movie: One Fight That Must Happen On 1 March

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ‘118’ యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్. నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా న‌టించారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాని మార్చి 1న విడుదల చేస్తున్నట్లు నిర్మాత మహేష్ కోనేరు తెలిపారు.

“సీట్ ఎడ్జింట్ థ్రిల్ల‌ర్ ఇది. క‌ల్యాణ్ రామ్‌గారు ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి జోన‌ర్. స్టంట్ డైరెక్టర్లు వెంక‌ట్‌, అన్బ‌రివు, రియ‌ల్ స‌తీష్ సమకూర్చిన అద్భుతమైన యాక్ష‌న్ పార్ట్ సినిమాలో చాలా కీల‌కంగా ఉంటుంది” అని ఆయన చెప్పారు.

One Fight That Must Happen On 1 March
Still from ABCD movie: One Fight That Must Happen On 1 March

అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’ సినిమా అదే పేరుతో మలయాళంలో వచ్చి హిట్టయిన సినిమాకు రీమేక్. ఒరిజినల్‌లో హీరోగా దుల్కర్ సల్మాన్ చేశాడు. సంజీవ్‌రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ బేనర్లపై మధుర శ్రీధర్, యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేం రుక్సార్ థిల్లాన్ నాయికగా నటిస్తోంది. కన్నడలో పేరుపొందిన సంగీత దర్శకుడు జుధా సాంధీ ఈ చిత్రానికి స్వరాలు కూరుస్తున్నారు.

శిరీష్‌కు తండ్రిగా నాగబాబు నటిస్తుండటం గమనార్హం. నిజ జీవితంలో శిరీష్‌కు నాగబాబు మేనమామ వరుస అవుతారనే విషయం తెలిసిందే. బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో ప్రేక్షకుల్ని అలరించిన భరత్ ఇందులో శిరీష్ ఫ్రెండ్‌గా నటిస్తుండటం ఇంకో విశేషం.