ర‌కుల్ ప్రీత్ సింగ్ సోద‌రుడు అమ‌న్ హీరోగా సినిమా మొదలైంది


ర‌కుల్ ప్రీత్ సింగ్ సోద‌రుడు అమ‌న్ హీరోగా సినిమా మొదలైంది

ప్ర‌ముఖ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ సోద‌రుడు అమ‌న్ క‌థానాయ‌కుడిగా దాస‌రి లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ఆదివారం హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. షేక్ షా వ‌లి స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జిని ఫిలిం కార్పొరేష‌న్ ప‌తాకంపై  మావురం ర‌జిని ఈ చిత్త్రాన్ని నిర్మిస్తున్నారు.

ముహుర్త‌పు స‌న్నివేశానికి ర‌కుల్ ప్రీత్ సింగ్ క్లాప్ కొట్ట‌గా, హీరో సందీప్ కిష‌న్ కెమెరా స్విచ్చాన్ చేశారు. మంచు ల‌క్ష్మి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ ప్రారంభోత్స‌వ వేడుక‌లో విల‌క్ష‌ణ న‌టుడు రావు ర‌మేష్ స‌హా చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

ర‌కుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ “నా సోద‌రుడు అమ‌న్ హీరోగా సినిమా ప్రారంభం కావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. రెండేళ్ల క్రితం త‌న‌కు హీరో కావాల‌నుంద‌ని చెప్ప‌గానే.. ‘ప్యాష‌న్ ఉందా?  ఉంటేనే ఇండ‌స్ట్రీలోకి రావాలి’ అని త‌న‌తో అన్నాను. త‌ను ప్యాష‌న్ ఉంద‌ని చెప్పాడు.

ఎంతో ప‌ట్టుద‌ల‌గా తెలుగు నేర్చుకుని త‌న ప్యాష‌న్ ఏంటో చూపించాడు. నాకు హైద‌రాబాద్ హోం టౌన్ ఎలా అయ్యిందో.. అమ‌న్‌కు కూడా ఇప్పుడు హైద‌రాబాద్ హోం టౌన్‌లా మారింది. త‌ను మంచి హీరోగా పేరు తెచ్చుకుంటాడ‌ని భావిస్తున్నాను” అన్నారు.

ర‌కుల్ ప్రీత్ సింగ్ సోద‌రుడు అమ‌న్ హీరోగా సినిమా మొదలైంది

ద‌ర్శ‌కుడు దాస‌రి లారెన్స్ మాట్లాడుతూ “ల‌వ్‌, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ క‌థాంశంతో రూపొందే సినిమాలో అమ‌న్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. త‌న పాత్ర ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. మంచి కామెడీ క‌థ‌లో భాగంగా ఉంటుంది. మార్చి మొద‌టి వారంలో తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమవుతుంది” అని చెప్పారు.

హీరో అమ‌న్ మాట్లాడుతూ “సంతోషంతో మాట‌లు రావ‌డం లేదు. చాలా నెర్వ‌స్‌గా, టెన్ష‌న్‌గా ఉంది. తెలుగులో హీరోగా ఎంట్రీ అవుతుండ‌టం చాలా సంతోషంగా ఉంది. మంచి క‌థ‌, స్క్రీన్‌ప్లేతో ద‌ర్శ‌కుడు దాస‌రి లారెన్స్‌గారు చెప్పిన విధానం న‌చ్చింది. అంద‌రికీ న‌చ్చుతుంది” అన్నారు.

నిర్మాత మావురం ర‌జిని మాట్లాడుతూ “దాస‌రి లారెన్స్‌గారు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాం. అలాగే అమ‌న్‌గారిని మా బ్యాన‌ర్ ద్వారా హీరోగా ప‌రిచ‌యం చేయ‌డం ఆనందంగా ఉంది. మార్చి ఫ‌స్ట్ వీక్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తాం” అన్నారు.

ఈ చిత్రానికి ఫైట్స్‌: రాబిన్‌-న‌భా, కో డైరెక్ట‌ర్‌: బూరుగుప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ‌, కెమెరా: జి.ఎల్‌.ఎన్‌.బాబు, మ్యూజిక్‌: మోహిత్ రెహ‌మానిక్‌, స‌హ నిర్మాత‌: పి.వెంక‌టేశ్వ‌ర్లు, క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం:  దాస‌రి లారెన్స్‌.

ర‌కుల్ ప్రీత్ సింగ్ సోద‌రుడు అమ‌న్ హీరోగా సినిమా మొదలైంది