Renu Desai To Play Hemalatha Lavanam


Renu Desai To Play Hemalatha Lavanam
Renu Desai

హేమలతా లవణం పాత్రలో రేణూ దేశాయ్

ఓ వైపు పవన్ కల్యాణ్ నటనకు తాత్కాలికంగానైనా స్వస్తి చెప్పి రాజకీయాల్లో నిమగ్నమైతే, ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ చాలా ఏళ్ల తర్వాత తెలుగులో నటించేందుకు సిద్ధమవుతున్నారు.

తెలుగునాట నాస్తికోద్యమానికి నాంది పలికి, తన జీవితాన్నంతా దానికే అంకింతం చేసిన గోరా శాస్త్రి కోడలు హేమలతా లవణం పాత్రను చేయడానికి ఆమె అంగీకరించారు. గోరా కుమారుల్లో లవణం ఒకరు.

దేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన ఉప్పు సత్యాగ్రహం కాలంలో పుట్టిన తన కుమారునికి ఆయన లవణం అనే పేరు పెట్టారు. ఆయన భార్యే హేమలత. గోరా కుటుంబమంతా నాస్తికత్వాన్ని పాటించి, దాన్ని ప్రచారం చేశారు. హేమలత కూడా అందులో చురుకుగా పాల్గొన్నారు.

“ఇటీవల ఒక సినిమాకు సంతకం చేశానని చెప్పడానికి సంతోషిస్తున్నా. ఒక వెరీ స్పెషల్ కేరెక్టర్ చేయబోతున్నా. వంశీకృష్ణ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో హేమలతా లవణం గారి పాత్ర చేస్తున్నా. ఇంకో మంచి వార్త ఏమంటే ఇంకో ముఖ్యమైన సినిమాకు కూడా సంతకం చేశాను. దాని షూటింగ్ వచ్చే వారం మొదలవుతుంది” అని తన ఇన్‌స్టాగ్రాం పేజీలో పోస్ట్ చేశారు రేణూ దేశాయ్.

తెలుగులో ఆమె ఇదివరకు రెండు సినిమాలు చేశారు. ఆ రెండూ పవన్ కల్యాణ్ జోడీగా చేసినవే. అవి.. ‘బద్రి’ (2000), ‘జానీ’ (2003). పవన్ కల్యాణ్‌ను వివాహమాడాక సినిమాలకు స్వస్తిచెప్పి, ఆయన నటించిన కొన్ని సినిమాలకు కాస్ట్యూం డిజైనర్‌గా పనిచేశారు. పవన్‌తో విడిపోయాక తన స్వరాష్ట్రం మహారాష్ట్రకు వెళ్లిపోయిన ఆమె మళ్లీ ఒకటిన్నర దశాబ్దం తర్వాత తెలుగు తెరపై నటిస్తుండటం విశేషం.