RRR: Jr NTR Will Shock You With His Super Toned Body


RRR: Jr NTR Will Shock You With His Super Toned Body
A still from Aravinda Sametha

ఆర్ఆర్ఆర్: కండల వీరుడిగా కనిపించనున్న జూనియర్ ఎన్టీఆర్

ఇవాళ హీరోలు సిక్స్ ప్యాక్‌లో కనిపించడం సాధారణమైపోయింది. సిక్స్ ప్యాక్ బాడీని బయటకు ప్రదర్శించకపోయినా కొంత మంది హీరోలు మంచి ఫిట్నెస్‌ను సాధిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ‘టెంపర్’ సినిమాలో తొలిసారి తన దృఢమైన శరీరాన్ని టాప్‌లెస్‌గా ప్రదర్శించాడు. ఆ తర్వాత ఇటీవల త్రివిక్రం సినిమా ‘అరవింద సమేత’లో చొక్కా లేకుడా సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శిస్తూ ఫైట్లు చేశాడు.

ఇప్పుడు మరోసారి ‘ఆర్ఆర్ఆర్’ కోసం తన శరీరాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాడని వినిపిస్తోంది. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఒక బందిపోటు తరహా పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తాడని సమాచారం. చిన్న ఎన్టీఆర్, రాంచరణ్.. ఇద్దరూ తమ శరీరాల్ని ప్రదర్శించే ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉన్నదని అంతర్గత వర్గాల సమాచారం.

చరణ్ చాలా కాలం నుంచే తన బాడీని దృఢంగా ఉంచుకుంటూ వస్తున్నాడు. చిన్న ఎన్టీఆర్ కూడా ఫిట్‌గానే ఉన్నా, తీర్చిదిద్దినట్లుండే శరీరాకృతి కావాలని రాజమౌళి సూచించడంతో, తన ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో ఆ శరీరాకృతి కోసం కష్టపడుతున్నాడు.

ఆ యాక్షన్ ఎపిసోడ్‌ను వచ్చే షెడ్యూల్‌లో చిత్రీకరిస్తారని తెలుస్తోంది. అప్పటికల్లా తన శరీరాన్ని చిన్న ఎన్టీఆర్ మలచుకోనున్నాడు.

ఈ మధ్యలో ఒక వారం రోజుల పాటు హాలిడేస్ గడపడానికి భార్యా పిల్లలతో కలిసి దుబాయ్ వెళ్లాడు.

Rajamouli Approaches Akshay Kumar For RRR?

RRR: One Police Station Set & Costumes Of Junior Artistes Leaked!