20 ఏళ్ల తర్వాత భన్సాలీ డైరెక్షన్‌లో సల్మాన్!


20 ఏళ్ల తర్వాత భన్సాలీ డైరెక్షన్‌లో సల్మాన్!

ఇరవై ఏళ్ల క్రితం ఆ ఇద్దరూ కలిసి పనిచేసిన సినిమా బాక్సాఫీస్ వద్ద  బ్రహ్మాండంగా ఆడింది. కానీ ఆ తర్వాత ఇంత దాకా వాళ్లు కలిసి పనిచేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత కలసి పనిచెయ్యాలని ఆ ఇద్దరూ నిర్ణయించుకున్నారు.

వాళ్లు.. బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్, టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ. ఇదివరకు వాళ్ల కాంబినేషన్‌లో ‘ఖామోషి’ (1996), ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ (1999) సినిమాలు వచ్చాయి. వీటిలో రెండో సినిమాలో సల్మాన్‌తో పాటు అజయ్ దేవ్‌గణ్, ఐశ్వరారాయ్ నటించారు. ముక్కోణ ప్రేమకథతో రూపొందిన ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఇప్పుడు ఆ ఇద్దరి కలిసి ఒక లవ్ స్టోరీ చెయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఇందులో సల్మాన్ జోడీ ఎవరన్నది ఇంకా వెల్లడి కాలేదు. లవ్ స్టోరీలను గ్రాండియర్‌గా తీసి మెప్పించే భన్సాలీ ఈ సినిమాని ఎలా తీయనున్నాడో చూడాలి.

భన్సాలీ మునుపటి సినిమా ‘పద్మావత్’ (2018) విమర్శకుల ప్రశంసలతో పాటు, బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్నీ పొందింది.

ప్రస్తుతం సల్మాన్ ‘భారత్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది జూన్ 5న విడుదల కానున్నది.