Security Of 18 Separatists And 155 Political Persons Withdrawn In Kashmir


Security Of 18 Separatists And 155 Political Persons Withdrawn In Kashmir
File Photo: Security Forces

కశ్మీర్‌లో 18 మంది వేర్పాటువాదులు, 155 మంది రాజకీయ నాయకులకు భద్రత ఉపసంహరణ

జమ్ము కశ్మీర్ ప్రభుత్వం 18 మంది వేర్పాటువాదులు, 155 మంది రాజకీయ నాయకులకు బుధవారం భద్రతను ఉపసంహరించింది. వారిలో పీడీపీ నాయకుడు వాహిద్ పర్రా, ఐఏఎస్ అధికారి షా ఫైసల్ ఉన్నారు. ఆదివారం భద్రతను ఉపసంహరించిన నలుగురికి ఇది అదనం.

రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ బీవీఆర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన భద్రత సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వేర్పాటువాద నాయకులకు భద్రత కల్పించడం అసలే కరువుగా ఉన్న రాష్ట్ర వనరుల్ని వృథా చెయ్యడమేననీ, ఆ భద్రతను వేరే ఎక్కడైనా సద్వినియోగం చేయవచ్చనీ ఆ సమావేశం అభిప్రాయపడింది.

భద్రత కుదించడమో లేదా ఉపసంహరించడమో చేసిన నాయకుల్లో ఎస్ఏఎస్ గీలాని, అగా సయ్యద్ మోస్వి, మౌల్వి అబ్బాస్ అన్సారి, యసీన్ మాలిక్, సలీం గీలాని, షాహిద్ ఉల్ ఇస్లాం, జఫర్ అక్బర్ భట్, నయీం అహ్మద్ ఖాన్, ముఖ్తార్ అహ్మద్ వాజా, ఫరూఖ్ అహ్మద్ కిచ్లూ, మస్రూర్ అబ్బాస్ అన్సారి, అగ సయ్యద్ అబ్దుల్ హుస్సేన్, అబ్దుల్ గని షా, మొహమ్మద్ ముసాదిఖ్ భట్ ఉన్నారు.