Short Film Maker Turns Director For Madhura Wines

‘మధుర వైన్స్’తో దర్శకుడవుతున్న జయకిశోర్
షార్ట్ ఫిలిమ్స్తో పేరు తెచ్చుకున్న జయకిశోర్ బి. సినీ డైరెక్టర్ కాబోతున్నాడు. వైన్ షాప్ నేపథ్యంలో ‘మధుర వైన్స్’ అనే సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు. జయకిశోర్ రూపొందించిన ’15 డేస్ ఆఫ్ లవ్’ అనే షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో 93 లక్షల వ్యూస్ సంపాదించడం ఒక విశేషంగా చెప్పుకోవాలి.
‘మధుర వైన్స్’ సినిమాని ఆర్.కె. సినీ టాకీస్, కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బేనర్లపై రాజేశ్ కొండేపు, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కార్తీక్ కుమార్ రోడ్రిగ్జ్ సంగీత దర్శకుడు. త్వరలోనే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానున్నది. ఇందులో నటించే తారాగణం వివరాలు అప్పుడే వెల్లడించనున్నారు.