Sonali Bendre Is Excited To Get Back To Work


Sonali Bendre Is Excited To Get Back To Work
Sonali Bendre and her son Ranveer

కచ్చితంగా నేను మళ్లీ పనిలోకి వస్తాను: సోనాలీ బెంద్రే

సోనాలీ బెంద్రే.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఇక్కడి ప్రేక్షకులకు ఆరాధ్య తారే. ‘మురారి’, ‘మన్మథుడు’, ‘ఇంద్ర’, ‘ఖడ్గం’,’శంకర్‌దాదా ఎంబీబీఎస్’ చిత్రాలు ఆమెను తెలుగువాళ్లకు సన్నిహితం చేశాయి.

బాలీవుడ్ నిర్మాత గోల్డీ బెహెల్‌ను పెళ్లాడిన ఆమె కొడుకు పుట్టాక కొంత కాలం పాటు సినిమాల జోలికి వెళ్లలేదు. అంతలోనే పిడుగులాంటి వార్త. సోనాలికి కేన్సర్ అని! కేన్సర్‌పై పోరాడుతూ అమెరికాలో చికిత్స పొందిన ఆమె ఇండియాకు తిరిగొచ్చింది. మళ్లీ పనిలోకి వస్తానని బల్లగుద్ది మరీ చెబుతోంది.

“కచ్చితంగా నేను పనిలోకి వస్తాను. ఇప్పుడు నా జీవితంలోని ప్రతి రోజూ పని చెయాలనుకుంటున్నా. నేనేం చెయ్యాలో తెలీదు. అందుకని ఓపెన్‌గా ఉన్నా. గత ఆర్నెల్లుగా మన మెదడు చురుగ్గా పనిచేస్తూ, శరీరం దానికి తగ్గట్లు సహకరించకపోతే, నిజంగా చికాగ్గా ఉంటుందని తెలిసొచ్చింది” అని చెప్పింది సోనాలి.

“మీకు తెలుసు, మన మెదడుకు తగ్గట్లు శరీరం పని చెయ్యని వయసు ఏదో ఒకనాటికి మనకు వస్తుంది. ఇప్పుడు నా స్థితి బాగానే ఉంది. మా అబ్బాయి (రణవీర్) పుట్టాక, ఎదిగే దాకా వాడితోటే ఉండాలని భావించా. అలాగే చేశా. వాడు మంచి అబ్బాయిలాగే ఎదిగాడు. ఇప్పుడు అమ్మెప్పుడూ వాడి దగ్గరే ఉండాల్సిన పనిలేదు. ఒక వ్యక్తిగా ఎదగడానికి వాడికంటూ స్వేచ్ఛ అవసరం. ఇప్పుడు నేను నా పనిలో నిమగ్నం కావచ్చు. పరిస్థితుల్ని అర్థం చేసుకొని, వాటికి తగ్గట్లు నడచుకోవడం ఈ ఆర్నెల్లలో వాడు నేర్చుకున్నాడు. వాడికా స్పేస్ ఇవాలి. నేను నా పనిలో మునగాల్సిన అవసరం ఉంది” అని ఆమె చెప్పుకొచ్చింది.

Sonali Bendre Is Excited To Get Back To Work
Sonali Bendre Is Excited To Get Back To Work