‘సైరా’ వర్సెస్ ‘సాహో’ వర్సెస్ ‘మహర్షి’: ఏ సినిమా ఏ క్లబ్బులో చేరుతుంది?

Sye Raa Vs Saaho Vs Maharshi: Who Will Enter The 100, 200 Or 300 Crore Club?

2018లో చాలా సినిమాలు అంచనాలను అందుకోలేకపోగా, ఏమాత్రం అంచనాల్లేని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా ఆడాయి. ఒకే ఒక్క సినిమా మాత్రమే రూ. 100 కోట్ల (షేర్) క్లబ్బులో చేరింది. అది రాంచరణ్ హీరోగా సుకుమార్ రూపొందించిన ‘రంగస్థలం’. అది రూ. 119.72 కోట్లను వసూలు చేసి టాప్‌లో నిలిచింది. మహేశ్, కొరటాల శివ కాంబినేషన్ సినిమా ‘భరత్ అనే నేను’ 94.8 కోట్లతో ఆ మార్కుకు సమీపంగా రాగలిగింది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ రూ. 88.8 కోట్లతో మూడో స్థానాన్ని ఆక్రమించింది.

రూ. 50 కోట్ల క్లబ్బులో 5 సినిమాలు మాత్రమే చోటు పొందాయి. అయితే వాటిలో ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య’ డిజాస్టర్లుగా నిలవడం గమనార్హం. విజయ్ దేవరకొండ, రశ్మికా మండన్న జంటగా పరశురాం రూపొందించిన ‘గీత గోవిందం’ ఎవరి ఊహకీ అందని రీతిలో రూ. 68 కోట్లను ప్రేక్షకుల నుంచి వసూలు చేసి అమితాశ్చర్యానికి గురి చేసింది.

2019లో ఒకటిన్నర నెల గడిచిపోయింది. రాంచరణ్-బోయపాటి సినిమా ‘వినయ విధేయ రామ’, బాలకృష్ణ-క్రిష్ సినిమా ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ సంక్రాంతికి వచ్చి ప్రేక్షకుల్ని నిరాశపరచి డిజాస్టర్స్ అయ్యాయి. వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి రూపొందించిన ‘ఎఫ్2’ సినిమా అండర్‌డాగ్‌గా అదే సంక్రాతికి వచ్చి, అనూహ్యంగా రూ. 79 కోట్లను వసూలు చేసి ఔరా అనిపించింది.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది రానున్న భారీ, క్రేజీ సినిమాల్లో ఏది ఏ క్లబ్బులో చేరుతుందనేది ఆసక్తికరంగా మారింది. అత్యంత భారీ బడ్జెట్‌లతో తయారవుతున్న ‘సైరా.. నరసింహారెడ్డి’, ‘సాహో’, ‘మహర్షి’ సినిమాలతో పాటు ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’, ‘మజిలీ’, ‘జెర్సీ’, డియర్ కామ్రేడ్’, ‘వెంకీ మామ’ వంటి క్రేజీ సినిమాలు కూడా ఒక దాని తర్వాత ఒకటిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటి బాక్సాఫీస్ అంచనాలు ఎలా ఉన్నాయంటే…

Sye Raa Vs Saaho Vs Maharshi: Who Will Enter The 100, 200 Or 300 Crore Club?
NTR: Mahanayakudu

యన్.టి.ఆర్ మహానాయకుడు: ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటించగా క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 22న వస్తోంది. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని చూపించే ఈ సినిమా రూ. 30 కోట్ల నుంచి రూ. 40 కోట్ల  మధ్య వసూలు చేస్తుందని అంచనా.

Sye Raa Vs Saaho Vs Maharshi: Who Will Enter The 100, 200 Or 300 Crore Club?
Lakshmi’s NTR

లక్ష్మీస్ ఎన్టీఆర్: లక్ష్మీపార్వతి అడుగుపెట్టాక ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు, ఆయన చివరి రోజులను చూపించే ఈ సినిమా అతి కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. అగస్త్య మంజు అనే కొత్త దర్శకుడితో కలిసి రాంగోపాల్ వర్మ రూపొందించిన ఈ సినిమా రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల మధ్యలో వసూలు చేస్తుందని అంచనా.

Sye Raa Vs Saaho Vs Maharshi: Who Will Enter The 100, 200 Or 300 Crore Club?
118

118: నందమూరి కల్యాణ్‌రాం హీరోగా సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్‌గా మారిన కె.వి. గుహన్ రూపొందించిన ఈ సినిమా మార్చి 1 విడుదలవుతోంది. నివేదా థామస్, శాలినీ పాండే హీరోయిన్లుగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్ల మధ్యలో వసూలు చేసే అవకాశాలున్నాయని అంచనా.

Sye Raa Vs Saaho Vs Maharshi: Who Will Enter The 100, 200 Or 300 Crore Club?
ABCD

ఏబీసీడీ: అల్లు శిరీష్ కథానాయకుడిగా సంజీవ్‌రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 21న విడుదలకు సిద్ధమవుతోంది. మలయళంలో ఇదే పేరుతో వచ్చి సూపర్ హిట్టయిన సినిమాకు రీమేక్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్లు వసూలు చేస్తుందని అంచనా.

Sye Raa Vs Saaho Vs Maharshi: Who Will Enter The 100, 200 Or 300 Crore Club?
Arjun Suravaram

అర్జున్ సురవరం: నిఖిల్ టైటిల్ పాత్రధారిగా టి.ఎన్. సంతోష్ రూపొందిస్తోన్న ఈ సినిమా మార్చి 29న విడుదలకు సిద్ధమవుతోంది. లావణ్యా త్రిపాఠి నాయికగా నటిస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రూ. 10 నుంచి 15 కోట్లు వసూలు చేసే అవకాశముంది.

Sye Raa Vs Saaho Vs Maharshi: Who Will Enter The 100, 200 Or 300 Crore Club?
Majili

మజిలీ: వివాహానంతరం నాగచైతన్య, సమంత తోలిసారి తెరపై జంటగా కనిపించే ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానున్నది. శివ నిర్వాణ రూపొందించిన ఈ చిత్రం రూ. 25 కోట్ల నుంచి రూ. 30 కోట్ల మధ్య వసూలు చేసే అవకాశాలున్నాయి.

Sye Raa Vs Saaho Vs Maharshi: Who Will Enter The 100, 200 Or 300 Crore Club?
Chitralahari

చిత్రలహరి: సాయిధరం తేజ్ హీరోగా కిశోర్ తిరుమల రూపొందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్ల మధ్య కలెక్షన్లు సాధించే అవకాశముంది.

Sye Raa Vs Saaho Vs Maharshi: Who Will Enter The 100, 200 Or 300 Crore Club?
Maharshi

మహర్షి: మహేశ్ టైటిల్ రోల్‌లో వంశీ పైడిపల్లి రూపొందిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పూజా హెగ్డే నాయికగా ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తయారవుతున్న ఈ సినిమా రూ. 110 కోట్ల నుంచి రూ. 120 కోట్ల మధ్య వసూలు చేయవచ్చని అంచనా.

Sye Raa Vs Saaho Vs Maharshi: Who Will Enter The 100, 200 Or 300 Crore Club?
iSmart Shankar

ఇస్మార్ట్ శంకర్: రాం టైటిల్ రోల్ చేస్తుండగా పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మే నెలలో విడుదల కానున్నది. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ హైదరాబాదీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూ. 25 కోట్ల్ల నుంచి రూ. 30 కోట్ల మధ్య కలెక్షన్లు రాబట్టవచ్చని అంచనా.

Sye Raa Vs Saaho Vs Maharshi: Who Will Enter The 100, 200 Or 300 Crore Club?
Dear Comrade

డియర్ కామ్రేడ్: విజయ్ దేవరకొండ హీరోగా నూతన దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తోన్న ఈ చిత్రం విడుదల తేదీ ఎప్పుడనేది వెల్లడి కాకపోయినా ఏడాది సెకాండాఫ్‌లోనే రావచ్చు. యాక్షన్ డ్రామాగా తయారవుతున్న ఈ చిత్రం రూ. 30 నుంచి రూ. 35 కోట్ల మధ్య వసూళ్లు సాధించవచ్చని అంచనా.

Sye Raa Vs Saaho Vs Maharshi: Who Will Enter The 100, 200 Or 300 Crore Club?
Saaho

సాహో: ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానున్నది. శ్రధా కపూర్ నాయికగా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ విడుదలయ్యే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద రూ. 175 కోట్ల నుంచి రూ. 200 కోట్ల మధ్య వసూళ్లు సాధించవచ్చనేది ప్రాథమిక అంచనా.

Sye Raa Vs Saaho Vs Maharshi: Who Will Enter The 100, 200 Or 300 Crore Club?
Sye Raa

సైరా.. నరసింహారెడ్డి: తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా తయారవుతున్న ఈ సినిమా అక్టోబర్‌లో దసరా సీజన్‌లో విడుదల కానున్నది. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తుండగా, సురేందర్‌రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రూ. 250 కోట్ల నుంచి రూ. 270 కోట్ల మధ్య వసూలు చేయవచ్చని అంచనాలు వేస్తున్నారు.

Sye Raa Vs Saaho Vs Maharshi: Who Will Enter The 100, 200 Or 300 Crore Club?
Venky Mama

వెంకీ మామ: వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆఖర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నది. శ్రియ, రకుల్‌ప్రీత్ హీరోయిన్లుగా ఫక్తు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తయారయ్యే ఈ సినిమా రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మధ్య వసూలు చేయవచ్చు.

– కార్తికేయ బుద్ధి