Tamil Billa Meets Telugu Billa!


Tamil Billa Meets Telugu Billa!
Prabhas and Ajith

ప్రభాస్‌ను కలిసిన అజిత్

తెలుగు ‘బిల్లా’ ప్రభాస్, తమిళ ‘బిల్లా’ అజిత్ కలుసుకున్నారు. రామోజీ ఫిలింసిటీలో ఈ సందర్భం తటస్థించింది. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫిలింసిటీలో జరుగుతోంది. ప్రభాస్ పాల్గొంటున్న సన్నివేశాల్ని దర్శకుడు చిత్రీకరిస్తున్నారు.

అంతలో అక్కడికి అజిత్ వచ్చారు. ఆ విషయం తెలియగానే ప్రభాస్ వచ్చి ఆయనను కలుసుకున్నారు. ఇద్దరూ కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నాక అజిత్ వెళ్లిపోయారు.

సందర్భవశాత్తూ అజిత్ సినిమా ‘పింక్’ తమిళ రీమేక్ సైతం ఫిలింసిటీలోనే షూటింగ్ జరుపుకుంటోంది. ఆ షూటింగ్ నిమిత్తం అజిత్ వచ్చారు. పక్కనే ‘సాహో’ షూటింగ్‌లో ప్రభాస్ ఉన్న విషయం తెలుసుకొని అక్కడకు వెళ్లారు. ‘పింక్’ రీమేక్‌ను శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మిస్తుండగా, ఒరిజినల్‌లో అమితాబ్ చేసిన పాత్రను అజిత్ పోషిస్తున్నారు.