Uri: The Surgical Strike Smashes Baahubali 2 Records

‘బాహుబలి’ రికార్డుల్ని బ్రేక్ చేసిన ‘ఉరీ’
విక్కీ కౌశల్ హీరోగా నటించిన ‘ఉరీ: ద సర్జికల్ స్ట్రైక్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. విడుదలై మూడు వారాలు దాటినా కలెక్షన్లలో ఏమాత్రం తగ్గనంటోంది. తాజాగా ‘బాహుబలి 2’కి సంబంధించిన రికార్డుల్ని బ్రేక్ చేసి తన ఖాతాలో వేసుకొంది.
విడుదలైన 23వ రోజు దేశంలో ‘ఉరీ’ రూ. 6.53 కోట్లు, 24వ రోజు రూ. 8.71 కోట్లు సాధించి రాజమౌళి సినిమా రికార్డుల్ని తుడిచి పెట్టింది. అవే రోజులకు సంబంధించి ‘బాహుబలి 2’ రూ. 6.35 కోట్లు, రూ. 7.80 కోట్లు సాధించింది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఈ వసూళ్లతో ‘ఉరీ’ దేశీయ బాక్సాఫీస్ వసూళ్లు రూ. 200 కోట్ల సమీపానికి చేరుకున్నాయి. ఒక మీడియం బడ్జెట్ సినిమా, సూపర్ స్టార్ కాని ఒక హీరో నటించిన సినిమా ఈ రేంజి బ్లాక్‌బస్టర్ కావడం అనూహ్యం. ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకొన్న ఈ సినిమా కొత్త బెంచ్‌మార్కులను సృష్టిస్తూ, రికార్డులను తిరగరాస్తోందని తరణ్ ఆదర్శ్ వ్యాఖ్యానించారు.
2016లో భారత రక్షణ సైన్యం పాకిస్తాన్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా నూతన దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు.