Uttar Pradesh: SP To Contest 37 & BSP Gets 38 Seats In Lok Sabha Elections

Uttar Pradesh: SP To Contest 37 & BSP Gets 38 Seats In Lok Sabha Elections
Akhilesh Yadav and Mayavati (file photo)

ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికలు: పొత్తులో బీఎస్పీకి 38, ఎస్పీకి 37 సీట్లు

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ 38 సీట్లలో, సమాజ్‌వాదీ పార్టీ 37 సీట్లలో పోటీపడనున్నాయి. గురువారం సీట్ల జాబితా విడుదల సందర్భంగా ఈ విషయాన్ని ఆ రెండు పార్టీలూ తెలిపాయి.

ఇదివరకు పొత్తు ప్రకటించినప్పుడు, రాష్ట్రంలోని 80 సీట్లలో చెరొక 38 సీట్లలో తాము పోటీ పడతామని ఆ పార్టీలు చెప్పాయి. తాము పంచుకున్న సీట్ల పేర్లను ఒక ప్రకటనలో అవి తెలియజేశాయి. ఆ ప్రకటనపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత మాయావతి సంతకం చేశారు.