‘రంగస్థలం’ నిర్మాతలతో మరో మెగా హీరో


'రంగస్థలం' నిర్మాతలతో మరో మెగా హీరో

‘రంగస్థలం’ సినిమాతో తొలిసారి ఒక మెగా హీరోతో కలిసి పనిచేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ త్వరలో మరో మెగా హీరోతో కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెగా క్యాంప్‌కు చెందిన సాయిధరంతేజ్‌తో ‘చిత్రలహరి’, అతని తమ్ముడు వైష్ణవ్‌తేజ్‌తో ఇంకో సినిమా చేస్తోన్న ఆ సంస్థ తాజాగా వరుణ్‌తేజ్‌తో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు అంతర్గత వర్గాల సమాచారం.

ఈ సినిమాతో ఒక కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. అతను చెప్పిన కథ వరుణ్‌కు బాగా నచ్చిందనీ, నిర్మాతలూ ఓకే అన్నారనీ ఆ వర్గాలు తెలిపాయి. ‘ఎఫ్2’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వరుణ్ ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయ్యేలోగా మైత్రీ మూవీ మేకర్స్ సినిమా పట్టాలెక్కే అవకాశముంది.