25వ జేమ్స్‌బాండ్ సినిమా పేరేంటి? కథేమిటి? ఎప్పుడొస్తుంది?


25వ జేమ్స్‌బాండ్ సినిమా పేరేంటి? కథేమిటి? ఎప్పుడొస్తుంది?

డేనియల్ క్రెగ్ చివరిసారిగా 007 కేరెక్టర్ చేస్తున్న 25వ జేమ్స్‌బాండ్ సినిమాకు డైరెక్టర్ మారాడు. సినిమాకు వర్కింగ్ టైటిల్ ప్రకటించారు.

జేమ్స్‌బాండ్ 25వ సారి ప్రేక్షకుల ముందుకు 2020 ఏప్రిల్ 8న రాబోతున్నాడు. నిజానికి ఈ ఏడాది చివరిలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ డైరెక్షన్ బాధ్యతల నుంచి డేనీ బోయల్ (‘స్లండాగ్ మిలియనీర్’ ఫేం) తప్పుకోవడం వల్ల చిత్ర నిర్మాణంలో జాప్యం చోటు చేసుకుంది.

జాప్యానికి ఇంకో కారణం కూడా ఉంది. ప్రధాన్ పాత్రధారి డేనియర్ క్రెగ్ మరో సినిమాకీ సంతకం చేయడం. ‘నైవ్స్ ఔట్’ అనే మర్డర్ మిస్టరీ సినిమాలో అతను నటించనున్నాడు. దీని షూటింగ్ వచ్చే నవంబర్‌లో మొదలు కానున్నది.

కొత్త జేమ్స్‌బాండ్ సినిమాని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు?

2018 సెప్టెంబర్ 20న యు.ఎస్. డైరెక్టర్ కేరీ ఫుకునాగ ఈ సినిమాని రూపొందించబోతున్నాడనే విషయం వెల్లడైంది. ‘ట్రూ డిటెక్టివ్’ అనే టీవీ సిరీస్ ద్వారా ఈ 41 ఏళ్ల డైరెక్టర్ పాపులరే. అలాగే ‘బీస్ట్స్ ఆఫ్ నో నేషన్’, ‘జేన్ ఐర్’ అనే సినిమాలు రూపొందించాడు.

మునుపటి బాండ్ ఫిల్మ్ ‘స్పెక్టర్’ (2015) డైరెక్టర్ శాం మెండిస్, ఆ సినిమా విడుదలయ్యాక, బాండ్ ఫ్రాంచైజీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత డేనీ బోయల్‌ను డైరెక్టర్‌గా ప్రకటించారు నిర్మాతలు. కానీ 2018 ఆగస్ట్ 21న సృజనాత్మక విభేదాల కారణంగా అతను తప్పుకున్నాడని తెలిపారు.

25వ జేమ్స్‌బాండ్ సినిమా పేరేంటి? కథేమిటి? ఎప్పుడొస్తుంది?

కొత్త జేమ్స్‌బాండ్ సినిమా టైటిల్ ఏమిటి?

డేనియల్ క్రెగ్ చివరి బాండ్ ఫిల్మ్ పేరు ‘షాటర్‌హ్యాండ్’. ఇప్పటివరకూ ఈ సినిమాని ‘బాండ్ 25’గా వ్యవహరిస్తూ వచ్చారు. ట్రేడ్ పబ్లికేషన్ ‘ప్రొడక్షన్ వీక్లీ’లో ఈ సినిమా వర్కింగ్ టైటిల్ ‘షాటర్‌హ్యాండ్’గా వెల్లడించారు.

పైన్‌వుడ్ స్టూడియోస్‌లో ఏప్రిల్ 6న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత లండన్, ఇటలీలోని మాటెరా లోకేషన్లలో షూటింగ్ జరుపుతారు. స్క్రిప్టులో కొన్ని ప్రధానమైన మార్పుల కారణంగా సినిమా విడుదల మొదట అనుకున్న 2020 ఫిబ్రవరి 14కు బదులు ఏప్రిల్ 8కి మారింది.

డెనియల్ క్రెగ్‌తో పాటు నవోమీ హారిస్, రాల్ఫ్ ఫియన్నెస్, లీ సీడౌక్స్ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. వీళ్లంతా ‘స్పెక్టర్’లో నటించినవాళ్లే.

అలాగే చివరి ఆరు బాండ్ సినిమాలకు పనిచేసిన నీల్ పర్విస్, రాబర్ట్ వేడ్.. ఈ సినిమాకీ స్క్రిప్ట్ సమకూరుస్తున్నారు. ఈ స్క్రిప్టుకు అమెరికన్ రచయిత రేమాండ్ బెన్సన్ రాసిన నెవ్వర్ డ్రీం ఆఫ్ డయ్యింగ్ (1999) ఆధారమని చెప్పుకుంటున్నారు.

సినిమా ప్లాట్ ఏమిటి?

లీకైన దాని ప్రకారం బాండ్ 25 పూర్తి స్థాయిలో కొత్తగా కనిపించనున్నాడు. అతను సీక్రెట్ సర్వీస్‌ను వదిలేసి, ప్రేమలో పడి, పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు! సో ఇంటరెస్టింగ్!

ఇందులో ట్విస్టేమిటంటే.. అతని భార్య హత్యకు గురవుతుంది. దాంతో తిరిగి అతను ముపటి పనిలోకి వస్తాడు. చూస్తుంటే ఇది ‘ఆన్ హర్ మెజెస్టీ’స్ సీక్రెట్ సర్వీస్’ ప్లాట్ తరహాలోనే అనిపిస్తోంది.

ఇంకో లీక్ ప్రకారమైతే లియాం నీసన్ సినిమా ‘టేకెన్’ తరహాలో ఈ సినిమా ఉండబోతోంది. ఇక బాండ్ పెళ్లిచేసుకొనేది ‘స్పెక్టర్’లో లీ సీడౌక్స్ పోషించిన డాక్టర్ మేడలీన్ స్వాన్‌ను.

25వ జేమ్స్‌బాండ్ సినిమా పేరేంటి? కథేమిటి? ఎప్పుడొస్తుంది?