Wonder! 2 Out Of Top 3 India’s Highest Grossing Films Are From Tollywood


Wonder! 2 Out Of Top 3 India's Highest Grossing Films Are From Tollywood

భారతదేశపు 3 అత్యధిక వసూళ్ల చిత్రాల్లో 2 తెలుగు సినిమాలే!

ప్రాంతీయ భాషా సినీ పరిశ్రమలతో పోలిస్తే దేశంలోనే బాలీవుడ్ అతి పెద్ద సినీ పరిశ్రమ. ఖాన్ త్రయాన్ని పక్కనపెడితే, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, హృతిక్ రోషన్, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్ వంటి హీరోలు కొన్ని బ్లాక్‌బ్లస్టర్స్ ఇచ్చారు, రికార్డులు కొల్లగొట్టారు.

కానీ అమితాశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమంటే.. దేశీయంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 3 సినిమాల్లో ఒక్క బాలీవుడ్ సినిమా కూడా లేదు. వాటిలో రెండు తెలుగు సినిమాలైతే, ఇంకోటి తమిళ చిత్రం. దేశంలో హిందీ సినిమాలు ఆడే థియేటర్లే ఎక్కువ అయినా, ప్రేక్షకుల అంచనాల్ని దక్షిణాది సినిమాల కంటే గొప్పగా అందుకోలేకపోతున్నాయనేది ఒక వాస్తవం.

బాహుబలి 2 (అన్ని వెర్షన్లు కలిపి రూ. 1417 కోట్లు)

ప్రభాస్, రానా, అనుష్క కాంబినేషన్‌తో యస్.యస్. రాజమౌళి రూపొందించగా, ప్రేక్షకులంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన ‘బాహుబలి 2’ దేశీయంగా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు సాధించింది. అన్ని వెర్షన్లు కలిపి దేశీయంగా రూ. 1400 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా హిందీ వెర్షన్ తొలిసారి రూ. 500 కోట్ల క్లబ్బులో చేరిన సినిమా అనే ఖ్యాతి దక్కించుకుంది.

2.0 (అన్ని వెర్షన్లు కలిపి రూ. 600 కోట్లు)

‘రోబో’ (ఎందిరన్)కు సీక్వెల్‌గా రజనీకాంత్, అక్షయ్ కుమార్ కాంబినేషన్‌తో శంకర్ రూపొందించిన ‘2.0’ దేశంలోనే అత్యంత భారీ వ్యయంతో తీసిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. దేశీయంగా భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా హిందీ వెర్షన్ రూ. 190 కోట్లు వసూలు చేయడం చిన్న విషయం కాదు.

బాహుబలి (అన్ని వెర్షన్లు కలిపి రూ. 420 కోట్లు)

బాలీవుడ్ సినిమాలకు సవాలు విసిరిన తొలి దక్షిణాది సినిమాగా నిలిచిన ‘బాహుబలి’ దేశీయ వినోద రంగ రూపురేఖల్నే మార్చేసింది. ప్రభాస్, రానా, రాజమౌళి త్రయానికి అన్యూహ్యమైన కీర్తి ప్రతిష్ఠల్ని సంపాదించిపెట్టిన ఈ సినిమా దేశంలో అన్ని వెర్షన్లు కలిపి రూ. 420 కోట్లు వసూలు చేసింది. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన ‘దంగల్’ దేశీయంగా సాధించిన వసూళ్లు రూ. 387.39 కోట్లు. బాలీవుడ్ సినిమాల పరంగా ఇప్పటికీ దీనిదే రికార్డు.