Yatra Box Office: Rs. 5 Crores Only!


Yatra Box Office: Rs. 5 Crores Only!
A Scene from Yatra

మూడు రోజులు.. 5 కోట్లు!

వైఎస్ రాజశేఖరరెడ్డిగా మమ్ముట్టి నటించిన ‘యాత్ర’ సినిమా ఆశించిన రీతిలో ఆడట్లేదని వసూళ్లు తెలియజేస్తున్నాయి. మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా విడుదలైన తొలి మూడు రోజుల్లో కేవలం రూ. 5 కోట్ల షేర్ మాత్రమే సాధించింది. విడుదల తర్వాత వచ్చిన పాజిటివ్ టాక్‌కీ, వసూళ్లకూ పొంతన లేకపోవడం ట్రేడ్ విశ్లేషకుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఈ సినిమా రూ. 15 కోట్ల లోటుతో విడుదలైందని అంచనా (అధికారిక సమాచారం కాదు). బిజినెస్ అయినంత వరకైనా ఈ సినిమా వసూళ్లు సాధిస్తుందా?.. అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఓవర్‌ఫ్లో అవడం అసాధ్యమని తేలుతోంది. తొలి వారాంతానికి ఏ ఒక్క ఏరియాలోనూ రూ. 1 కోటి షేర్ వసూలు కాకపోవడం విచిత్రమని చెప్పాలి.

నైజాంలో రూ. 64 లక్షలు, రాయలసీమలో రూ. 96 లక్షలు, గుంటూరులో రూ. 82 లక్షలు వసూలయ్యాయి. ఆంధ్రా ఏరియా మొత్తంలో ‘యాత్ర’ వసూలు చేసింది రూ. 2.36 కోట్లు. ఓవర్సీస్‌లోనూ వసూళ్లు సంతృప్తికరంగా లేవు. అక్కడ రూ. 70 లక్షలే వచ్చాయి.

బాక్సాఫీస్ వద్ద ఇదే ధోరణి కొనసాగితే ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 8 కోట్ల నుంచి 9 కోట్ల మధ్యలోనే షేర్ సాధించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Yatra Review: 4 Ups And 3 Downs