‘118’ వసూళ్లు: రూ. 5 కోట్లు దాటాయ్!


'118' వసూళ్లు: రూ. 5 కోట్లు దాటాయ్!

నందమూరి కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా కె.వి. గుహన్ రూపొందించిన ‘118’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశాజనక ఫలితాల్ని రాబడుతోంది. నివేదా థామస్, షాలినీ పాండే నాయికలుగా నటించిన ఈ సినిమా మార్చి 1న విడుదలై పాజిటి టాక్‌తో తొలిరోజు నుంచి స్థిరంగా వసూళ్లను అందుకుంటోంది.

వీకెండ్‌తో పాటు సోమవారం మహాశివరాత్రి కావడంతో ఆశించినట్లే కలెక్షన్లు వచ్చాయి. 4 రోజులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘118’ వసూళ్లు రూ. 5.58 కోట్లకు చేరుకున్నాయి. సెలవు రోజులు అయిపోయినా మంగళవారం సైతం థియేటర్ల వద్ద టికెట్ అమ్మకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

వసూళ్ల ధోరణి ఇదే తీరున కొనసాగితే వచ్చే వారంలో బ్రేకీవెన్ సాధించే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయంటున్నారు. అంటే ‘పటాస్’ తర్వాత కల్యాణ్‌రామ్ ఖాతాలో మరో హిట్ చేరినట్లే. ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బేనర్‌పై మహేశ్ కోనేరు నిర్మించారు.