‘ఫారెస్ట్ గంప్’ రీమేక్‌లో ఆమిర్ ఖాన్!


'ఫారెస్ట్ గంప్' రీమేక్‌లో ఆమిర్ ఖాన్!

రాకేశ్‌శర్మ బయోపిక్ నుంచి బయటకు వచ్చేసిన ఆమిర్ ఖాన్ త్వరలో హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ అధికారిక హిందీ రీమేక్‌లో నటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

పారామౌంట్ పిక్చర్స్ సంస్థ నుంచి ‘ఫారెస్ట్ గంప్’ హిందీ రీమేక్ హక్కుల్ని ఆమిర్ పొందాడంటూ ఇంటర్నెట్‌లో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఆ సినిమాలో ప్రధాన పాత్రను ఆమిర్ పోషించనున్నాడు. దీన్ని బాలీవుడ్ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.

ఆ వర్గాల ప్రకారం అధికారికంగా ఆమిర్ ఆ ప్రాజెక్ట్‌లోకి వచ్చాడు. ‘ఫారెస్ట్ గంప్’ హక్కుల్ని పొందాడు. దీనికి సంబంధించి అతి త్వరలోనే ఆమిర్ నుంచి ప్రకటన రానున్నది. ‘ఫారెస్ట్ గంప్’ (1994)లో టాం హాంక్స్ హీరోగా నటించాడు. 1986లో విన్‌స్టన్ గ్రూమ్ అదే పేరుతో రాసిన నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు.

55 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ కామెడీ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 677 మిలియన్ డాలర్లను ఆర్జించడం విశేషం.