ఇక వర్మ దృష్టి ‘శశికళ’పైన!


ఇక వర్మ దృష్టి 'శశికళ'పైన!
Sasikala

ఇక వర్మ దృష్టి ‘శశికళ’పైన!

వివాదాస్పద ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ దృష్టి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ జీవితంపై పడింది. ‘శశికళ’ టైటిల్‌తో సినిమాని రూపొందిస్తున్నట్లు తన ట్విట్టర్ పేజీ ద్వారా ఆయన వెల్లడించారు. ‘లవ్ ఇస్ డేంజరస్‌లీ పొలిటికల్’ అనే ట్యాగ్ లైన్‌ను టైటిల్‌కు జత చేశారు.

“నిర్దయులైన పురుషులకూ, జైళ్లకూ, మన్నార్‌గుడి గ్యాంగ్స్‌కూ విరుద్ధంగా దృఢపడిన ఒక అనుబంధపు కథ”గా వర్మ ఈ సినిమాని పేర్కొన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆయన తెలిపారు.

జయలలితకు అత్యంత నమ్మకస్తురాలు, నెచ్చెలిగా పేరుపొందిన శశికళ అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. జయలలిత అనారోగ్యానికి గురై చెన్నై అపోలో హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ మరణించాక, అందులో శశికళ పాత్రపై అనేక సందేహాలు తలెత్తిన విషయం తెలిసిందే. జయలలిత మరణానికి ఆమే కారణమంటూ ఆరోపణలొచ్చాయి. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి కావడానికి ఆమె చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

కాగా ‘శశికళ’ సినిమాలో టైటిల్ రోల్‌ను ఎవరు చేస్తారు, జయలలితగా ఎవరు కనిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాతో వర్మ ఎన్ని వివాదాలకు కారకుడవుతాడో చూడాలి.

ఇక వర్మ దృష్టి ‘శశికళ’పైన!| actioncutok.com

You may also like: