‘ఆర్ఎక్స్ 100’ తర్వాత ‘ఆర్డీఎక్స్’!


'ఆర్ఎక్స్ 100' తర్వాత 'ఆర్డీఎక్స్'!

‘ఆర్ఎక్స్ 100’ తర్వాత ‘ఆర్డీఎక్స్’!

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న పాయల్ రాజ్‌పుట్ నాయికగా ‘ఆర్డీఎక్స్’ అనే సినిమా రూపొందుతోంది. హ్యాపీ మూవీస్ బేనర్‌పై సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆదివారం విజయవాడలోని కె.ఎల్. యూనివర్సిటీలో ప్రారంభమైంది.

శంకర్ భాను (ఇదివరకు భానుశంకర్) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తేజుస్ (‘ఆవకాయ బిర్యానీ’ ఫేం) హీరో. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఎఫ్‌డీసీ ఛైర్మన్ అంబికా కృష్ణ క్లాప్ కొట్టగా, విజయవాడ అర్బన్ టీడీపీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్ర నిర్మాత సి. కల్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు.

సి. కల్యాణ్ మాట్లాడుతూ “ఇది పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. పాయల్ పోషిస్తున్న పాత్ర అందర్నీ మెప్పించేలా అద్భుతంగా ఉంటుంది. నేటి నుంచే రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్నాం. విజయవాడలో 4 రోజులు షూటింగ్ జరిపి, పోలవరం, రాజమండ్రి పరిసరాల్లో 40 రోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరణ జరుపుతాం. షూటింగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహిస్తున్నాం” అని తెలిపారు.

'ఆర్ఎక్స్ 100' తర్వాత 'ఆర్డీఎక్స్'!

పాయల్ రాజ్‌పుట్ మాట్లాడుతూ “నా తొలి సినిమా ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత మరో పవర్‌ఫుల్ కేరెక్టర్ చేస్తున్నా. డైరెక్టర్ శంకర్ భాను నా పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు” అని చెప్పారు.

హీరో తేజుస్ మాట్లాడుతూ “ప్రతి పాత్రకూ ప్రాముఖ్యం ఉండేలా డైరెక్టర్ కథను తీర్చిదిద్దారు. పాయల్ వంటి కోస్టార్‌తో చేస్తున్నందుకు ఆనందంగా ఉంది” అన్నారు.

డైరెక్టర్ శంకర్ భాను మాట్లాడుతూ “ఇది ఇంటెన్స్ సబ్జెక్ట్. ‘ఆర్ఎక్స్ 100’తో తనేమిటో ప్రూవ్ చేసుకున్న పాయల్ ఇందులో ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఆమెది చాలా ఇంటెన్స్ కేరెక్టర్” అని చెప్పారు.

న‌రేష్ వి.కె., నాగినీడు, ఆదిత్య మీన‌న్‌, ఆమ‌ని, తుల‌సి, ఐశ్వ‌ర్య‌, విద్యుల్లేఖ, చమ్మ‌క్ చంద్ర‌, స‌త్తిపండు, జెమిని సురేష్‌, స‌త్య శ్రీ, జోయ, దేవిశ్రీ, సాహితి తారాగణమైన ఈ చిత్రానికి డైలాగ్స్‌: ప‌రుశురాం, స్క్రిప్ట్ అసోసియేష‌న్‌: అనిల్‌, పాట‌లు: భాస్క‌రభ‌ట్ల‌, కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌, మ్యూజిక్: ర‌ధ‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌: సి. రాంప్ర‌సాద్‌, ఎడిట‌ర్‌: ప్ర‌వీణ్ పూడి, ఫైట్ మాస్ట‌ర్: న‌ందు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  చిన్నా, స్టోరి, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  శంక‌ర్ భాను.

‘ఆర్ఎక్స్ 100’ తర్వాత ‘ఆర్డీఎక్స్’! | actioncutok.com

You may also like: