‘పార్థు’గా బన్నీ!


'పార్థు'గా బన్నీ!

‘పార్థు’గా బన్నీ!

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూడో సినిమా రూపకల్పనకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. బన్నీ పుట్టినరోజు ఏప్రిల్ 8న ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం.

ఇప్పటికే ప్రధాన నాయికగా పూజా హెగ్డే ఎంపికైందని వినిపించగా, తాజాగా రెండో నాయిక కూడా ఇందులో ఉంటుందనీ, ఆ పాత్రకు కేథరిన్ ట్రెసా చేసే అవకాశాలు ఉన్నాయనీ వినిపిస్తోంది.

ఈ సినిమా తండ్రీ కొడుకుల చుట్టూ తిరిగే కథ అనీ, అందువల్ల ‘నాన్న.. నేను’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నదనీ ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ సంస్థ ఫిల్మ్ చాంబర్‌లో ‘పార్థు’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించింది. ఆ టైటిల్ ఈ సినిమా కోసమే అనే మాట కూడా వినిపిస్తోంది.

త్రివిక్రమ్ రూపొందించిన ‘అతడు’ సినిమాలో మహేశ్ కేరెక్టర్ పేరు పార్థు కావడం గమనార్హం. ఆ సినిమాలో నిజానికి మహేశ్ పేరు నందకిశోర్ అలియాస్ నందు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో పార్థు (ఆ పేరు రాజీవ్ కనకాలది) స్థానంలోకి వస్తాడు. పార్థుగానే చలామణీ అవుతాడు.

‘అతడు’ సినిమా ఎంత పాపులర్ అయ్యిందో ‘పార్థు’ పేరూ అంత పాపులర్ అయ్యింది. అందుకే ఆ టైటిల్‌తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ సంకల్పించాడు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బేనర్‌పై ఆ టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడు.

ఈ నేపథ్యంలో బన్నీ ‘పార్థు’గా కనిపిస్తాడా, లేక ‘నాన్న.. నేను’ అంటాడా.. అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

‘పార్థు’గా బన్నీ! | actioncutok.com

You may also like: