‘మహర్షి’ రిలీజ్ డేట్ మారడానికి కారణం.. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’?


'మహర్షి' రిలీజ్ డేట్ మారడానికి కారణం.. 'అవెంజర్స్: ఎండ్‌గేమ్'?

‘మహర్షి’ సినిమా విడుదలను రెండు వారాలు వెనక్కి జరపడానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తవకపోవచ్చనే కారణంతో పాటు అశ్వినీదత్ మే 9 సెంటిమెంట్ (‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘మహానటి’ విడుదల తేదీ) కారణాన్ని దిల్ రాజు చెప్పినప్పటికీ ఏప్రిల్ 25 నుంచి మే 9కి సినిమా వాయిదా పడటానికి ఒక ప్రధాన కారణం ఉందని తెలుస్తోంది.

అది ఏప్రిల్ 26న బిగ్గెస్ట్ హాలీవుడ్ ఫిల్మ్ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ విడుదలవుతుండటం. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆ సినిమాలో విలన్ థానోస్‌ను సూపర్ హీరోలు ఎలా మట్టి కరిపిస్తారో చూడాలనే ఆత్రుత అందరిలో ఉంది. దానికి తగ్గట్లు అత్యధిక థియేటర్లలో ఆ సినిమా విడుదల కాబోతోంది.

దాని ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండకపోయినా యు.ఎస్.లో చాలా ఎక్కువగా ఉంటుంది. ‘మహర్షి’కి థియేటర్లు దొరికే అవకాశం ఉండదు. మహేశ్‌కు యు.ఎస్. బాగా కలిసొచ్చిన మార్కెట్. అతిపెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రాంతం. తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాపయిన సినిమాలు సైతం అక్కడ మంచి వసూళ్లు సాధించిన సందర్భాలున్నాయి.

ఏప్రిల్ 25న ‘మహర్షి’ని విడుదల చేస్తే యు.ఎస్.లో ఓపెనింగ్స్‌పై ‘అవెంజర్స్’ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ విషయాన్ని యు.ఎస్. డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతల దృష్టికి తీసుకు రావడం వల్లే విడుదలను మే 9కి వాయిదా వెయ్యాలనే నిర్ణయం తీసుకున్నట్లు అంతర్గత వర్గాల సమాచారం.

మహేశ్ జోడీగా పూజా హెగ్డే నటిస్తోన్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకుడు.