సైనా నెహ్వాల్ బయోపిక్: శ్రద్ధ ఔట్.. పరిణీతి ఇన్!


సైనా నెహ్వాల్ బయోపిక్: శ్రద్ధ ఔట్.. పరిణీతి ఇన్!
పరిణీతి చోప్రా

సైనా నెహ్వాల్ బయోపిక్: శ్రద్ధ ఔట్.. పరిణీతి ఇన్!

నెలల తరబడి బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకున్న తర్వాత సైనా నెహ్వాల్ బయోపిక్ నుంచి వైదొలగింది శ్రద్ధా కపూర్. ఆమె స్థానంలోకి పరిణీతి చోప్రా వచ్చింది. ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రద్ధ తప్పుకోవడానికి కారణం దానికి డేట్స్ కేటాయించలేకపోవడమే!

అమోల్ గుప్తే డైరెక్ట్ చేసే ఈ సినిమా కోసం 2018 సెప్టెంబర్‌లో ప్రిపరేషన్ మొదలుపెట్టింది శ్రద్ధ. కానీ షూటింగ్‌కు వెళ్లలేకపోయింది. మొదట ఆమె డెంగ్యూతో బాధపడింది. తర్వాత ‘సాహో’, ‘స్ట్రీట్ డాన్సర్ 3డి’ షూటింగ్స్‌తో బిజీ అయింది. నిజానికి ఈ ఏప్రిల్ నుంచి ఆ సినిమా షూటింగ్‌లోకి వెళ్లాల్సి ఉంది. కానీ నిర్మాత భూషణ్ కుమార్ ఆమెను తప్పించి, పరిణీతి చోప్రాకు అవకాశమిచ్చాడు.

శ్రద్ధ బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకొనే దర్శక నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ నెలాఖరుకు ‘ఛిచ్చోర్’ సినిమాని శ్రద్ధ పూర్తి చేయనున్నది. దాని తర్వాత భూషణ్ కుమారే నిర్మిస్తోన్న ‘స్ట్రీట్ డాన్సర్ 3డి’కి సంబంధించిన ముంబై షెడ్యూల్లో ఆమె పాల్గొనాల్సి ఉంది. ప్రభాస్ జోడీగా ఆమె నటిస్తోన్న ‘సాహో’ ఆగస్టులో విడుదల కానున్నది.

అలాగే టైగర్ ష్రాఫ్‌తో ఆమె చేయబోతున్న ‘బాఘి 3’ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవుతుందని భావిస్తున్నారు. పరస్పర అంగీకారంతోనే సైనా బయోపిక్ నుంచి శ్రద్ధ తప్పుకున్నదని సమాచారం. మరోవైపు తనకు వచ్చిన అవకాశాన్ని ఆనందంగా ఆహ్వానించింది పరిణీతి చోప్రా. అతి త్వరలోనే ఆ కేరెక్టర్ ప్రిపరేషన్ వర్క్‌లోకి ఆమె వెళ్లనున్నది.

ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ పూర్తి చేసి, 2020 మొదట్లో చిత్రాన్ని విడుదల చేయాలని సంకల్పించినట్లు నిర్మాత భూషణ్ కుమార్ తెలిపాడు.

సైనా నెహ్వాల్ బయోపిక్: శ్రద్ధ ఔట్.. పరిణీతి ఇన్!
శ్రద్ధా కపూర్

సైనా నెహ్వాల్ బయోపిక్: శ్రద్ధ ఔట్.. పరిణీతి ఇన్! | actioncutok.com

You may also like: