ఖరారు: వైష్ణవ్ తేజ్ సినిమాలో విలన్ మక్కల్ సెల్వన్!


ఖరారు: వైష్ణవ్ తేజ్ సినిమాలో విలన్ మక్కల్ సెల్వన్!

ఖరారు: వైష్ణవ్ తేజ్ సినిమాలో విలన్ మక్కల్ సెల్వన్!

చిరంజీవి మేనల్లుడు, సాయిధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న పేరు పెట్టని సినిమా ఆ మధ్య లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

తెలుగమ్మాయి మనీషా రాజ్ నాయికగా నటిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి సుకుమార్ రైటింగ్స్ పతాకంపై సుకుమార్ స్వయంగా నిర్మిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

కాగా ఈ సినిమాలో విలన్‌గా తమిళ క్రేజీ హీరో ‘మక్కల్ సెల్వన్’గా పేరుపొందిన విజయ్ సేతుపతి నటించనున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అది నిజమేననే విషయాన్ని అంతర్గత వర్గాలు ధ్రువీకరించాయి. సేతుపతి కేరెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గానే కాకుండా విలక్షణంగా కూడా ఉంటుందని ఆ వర్గాలు చెప్పాయి. ఆ కేరెక్టర్‌కు అతనైతే న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో సుకుమార్ అతనిని సంప్రదించాడు. సేతుపతి సంతోషంగా ఓకే చెప్పాడు.

విజయ్ ఇటీవల రజనీకాంత్ సినిమా ‘పేట’లో సైడ్ విలన్‌గా కనిపించాడు. ఇప్పటికే నేరుగా ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. అది చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న ‘సైరా.. నరసింహారెడ్డి’. ఈ సినిమాలో రాజా పాండి అనే పాత్రను సేతుపతి చేస్తున్నాడు.

ఖరారు: వైష్ణవ్ తేజ్ సినిమాలో విలన్ మక్కల్ సెల్వన్! | actioncutok.com

You may also like: