వెల్లడైంది: ‘డియర్ కామ్రేడ్’ తొలి టీజర్ మార్చి 17న వస్తోంది


వెల్లడైంది: 'డియర్ కామ్రేడ్' తొలి టీజర్ మార్చి 17న వస్తోంది

విజయ్ దేవరకొండ హీరోగా నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. రష్మిక మండన్న కథానాయిక. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నెల 17న తొలి టీజర్ తో ప్రచారానికి తెర లేపుతున్నారు.

‘డియర్ కామ్రేడ్’ను తెలుగుతో పాటు మిగతా దక్షిణాది భాషల్లోనూ, అంటే తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ పేజీ ద్వారా విజయ్ దేవరకొండ తెలిపాడు.

ఆ సందర్భంగా తనను హీరోయిన్ రష్మిక గాఢాలింగనం చేసుకున్న సినిమా స్టిల్ ను పోస్ట్ చేశాడు. కొద్ది సేపట్లోనే ఆ స్టిల్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. మే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.