త‌ల్లిదండ్రులు తప్పక చూడాల్సిన చిత్రం ‘1st ర్యాంక్ రాజు’


త‌ల్లిదండ్రులు చూడాల్సిన చిత్రం '1st ర్యాంక్ రాజు'

త‌ల్లిదండ్రులు తప్పక చూడాల్సిన చిత్రం ‘1st ర్యాంక్ రాజు’

చేత‌న్ మ‌ద్దినేని హీరోగా డాల్ఫిన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై న‌రేష్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మంజునాథ్ వి.కందుకూర్ నిర్మిస్తున్న చిత్రం ‘1st ర్యాంక్ రాజు’. విద్య 100% బుద్ధి 0% ఉప శీర్షిక‌. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, లోగో, టీజ‌ర్‌ను ‘మా’ అధ్య‌క్షుడు న‌రేష్‌, డైరెక్ట‌ర్ మారుతి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో…

మా అధ్య‌క్షుడు వి.కె.న‌రేష్ మాట్లాడుతూ – ‘ఒక అద్భుత‌మైన పాయింట్‌ని ఎంట‌ర్ టైనింగ్‌గా చెప్ప‌డం చాలా గొప్ప విష‌యం. క‌న్న‌డలో చాలా పెద్ద హిట్ అయిన ఈ చిత్రాన్ని అదే టీం తెలుగులో చేయ‌డం మొద‌టి స‌క్సెస్‌గా నేను భావిస్తున్నాను. క‌న్న‌డంలో నేను సినిమా చేశాను. అదే పాత్ర‌ను తెలుగులో చేయడానికి చాలా థ్రిల్ అయ్యాను.

అఆ సినిమాతో కూతుర్లంద‌రూ ఇలాంటి తండ్రి ఉంటే బావుండేద‌నుకున్నారు. లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు ఈ సినిమాతో అబ్బాయిలంద‌రూ ఇలాంటి తండ్రి ఉండాల‌నుకునేలా అబ్బాయిల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది.

ఈ సినిమా చార్లి చాప్లిన్ ఫార్ములాతో తెర‌కెక్కింది. ఎందుకంటే చార్లి చాప్లిన్ కామెడీ చేస్తున్నా.. వెనుకు చిన్న పెయిన్ ఉంటుంది. అలాంటి ఫార్ములాతో చేసిన సినిమాల‌న్నీ పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే ఫార్ములాతో తెర‌కెక్కించారు.ఇలాంటి సినిమా చేయ‌డాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నారు.

హీరో చేత‌న్ మ‌ద్దినేని మాట్లాడుతూ – ‘ప్ర‌తి ఫ‌స్ట్ ర్యాంక్ స్టూడెంట్ బ‌యోపిక్ ఇది. ప్ర‌తి ఒక్క‌రూ వారి లైఫ్‌లో ఎక్క‌డో ఒక‌చోట నెంబ‌ర్ వ‌న్ అయ్యుంటారు కాబ‌ట్టి వారంద‌రి బ‌యోపిక్ ఇది. మా డైరెక్ట‌ర్ న‌రేష్‌కుమార్‌గారి క‌థ ఇది. త‌ల్లిదండ్రులంద‌రూ చూడాల్సిన సినిమా. ఒక ప‌క్క అమాయ‌కంగా, మ‌రో ప‌క్క అన్నీ తెలుసు అనేలా న‌టించే చాలెంజింగ్ పాత్ర‌లో న‌టించ‌డం కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌’ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ కిర‌ణ్ ర‌వీంద్ర‌నాథ్ స‌హా ఎంటైర్ యూనిట్ పాల్గొన్నారు.

త‌ల్లిదండ్రులు తప్పక చూడాల్సిన చిత్రం '1st ర్యాంక్ రాజు'

త‌ల్లిదండ్రులు తప్పక చూడాల్సిన చిత్రం ‘1st ర్యాంక్ రాజు’ | actioncutok.com