వాచ్‌మన్ ట్రైలర్: మునివేళ్లపై కూర్చోబెట్టడం ఖాయం!


వాచ్‌మన్ ట్రైలర్: మునివేళ్లపై కూర్చోబెట్టడం ఖాయం!

వాచ్‌మన్ ట్రైలర్: మునివేళ్లపై కూర్చోబెట్టడం ఖాయం!

జీవీ ప్రకాశ్‌కుమార్ హీరోగా నటించిన ‘వాచ్‌మన్’ సినిమా అనుకోని కష్టాల్లో పడిన ఒక యువకుడి కథ. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. దాని ప్రకారం ఇది తన యజమానిని కాపాడ్డానికి ఒక బొచ్చుకుక్క ఎలాంటి సాహసాలు చేసిందనే కథ కూడా అని తెలుస్తోంది.

ఎక్కువగా రాత్రివేళలోనే కథ నడుస్తున్నట్లు, ప్రేక్షకులు మునివేళ్లపై కూర్చొని ఉత్కంఠతో వీక్షించే విధంగా సినిమా ఉండేట్లు ఆ ట్రైలర్ తెలియజేస్తోంది. తమిళ యువ కథానాయకుడు శివ కార్తికేయన్ తన ట్విట్టర్ పేజీ ద్వారా ‘వాచ్‌మన్’ ట్రైలర్‌ను బుధవారం ఆవిష్కరించాడు.

వాచ్‌మన్ ట్రైలర్: మునివేళ్లపై కూర్చోబెట్టడం ఖాయం!

‘మదరాసపట్టినం’, ‘తలైవా’, ‘అభినేత్రి’, ‘కణం’ చిత్రాల దర్శకుడు ఎ.ఎల్. విజయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సంయుక్తా హెగ్డే, యోగిబాబు, సుమన్, మునీశ్‌కాంత్, రాజ్ అర్జున్ వంటివాళ్లు నటించారు. ఈ సినిమాలో వాటర్ కేన్స్ అమ్ముకొని జీవించే దిగువ మధ్యతరగతి యువకుడిగా జీవీ ప్రకాశ్ నటించాడు. అతను ఒక అనూహ్యమైన, ప్రాణసంకటమైన స్థితిలోకి ఎలా వెళ్లాడు, దాన్నుంచి ఎలా బయటపడ్డాడనేది ‘వాచ్‌మన్’ చిత్రంలోని ప్రధానాంశం.

 నిరవ్ షా, శరవణన్ రామసామి సినిమాటోగ్రాఫర్‌లుగా పనిచేసిన ఈ సినిమా ప్రకాశ్ సంగీతం సమకూర్చాడు. ఏప్రిల్ 12న ‘వాచ్‌మన్’ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ప్రకాశ్ చివరగా రాజీవ్ మీనన్ డైరెక్ట్ చేసిన ‘సర్వం తాళ మయం’ చిత్రంలో నటించాడు.

వాచ్‌మన్ ట్రైలర్: మునివేళ్లపై కూర్చోబెట్టడం ఖాయం! | actioncutok.com

You may also like: