‘ఇస్మార్ట్ శంకర్’ మామూలోడు కాదు.. కండల వీరుడు!


'ఇస్మార్ట్ శంకర్' మామూలోడు కాదు.. కండల వీరుడు!

‘ఇస్మార్ట్ శంకర్’ మామూలోడు కాదు.. కండల వీరుడు!

ఇప్పటివరకు జోవియల్ రోల్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తూ వచ్చిన రామ్, వాటికి పూర్తి భిన్నమైన మాస్ కేరెక్టర్‌తో వస్తోన్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేశ్ నాయికలుగా నటిస్తున్నారు. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ మెమరీ లాస్ కేరెక్టర్ చేస్తున్నాడు.

తన సినిమాల్లో హీరోలను భిన్న తరహాలో చూపించే పూరి జగన్నాథ్, ‘ఇస్మార్ట్ శంకర్’గా రాంను డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేస్తున్నాడు. దానికి తగ్గ లుక్స్ కోసం జింలో బాగా శ్రమిస్తున్నాడు రామ్.

ఇప్పటివరకు మనం రాంను సిక్స్ ప్యాక్‌లో చూడలేదు. ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. పర్సనల్ జింలో తను చేస్తున్న కసరత్తుల్ని తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశాడు రామ్.

గోవా షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ‘ఇస్మార్ట్ శంకర్’ త్వరలో హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌లోకి వెళ్లనున్నాడు. మేలో చిత్రాన్ని విడుదల చేయాలనేది నిర్మాతల సంకల్పం.

‘ఇస్మార్ట్ శంకర్’ మామూలోడు కాదు.. కండల వీరుడు! | actioncutok.com

You may also like: