లోక్సభ ఎన్నికలు: అన్ని సీట్లలోనూ కమల్ హాసన్ పార్టీ పోటీ

లోక్సభ ఎన్నికలు: అన్ని సీట్లలోనూ కమల్ హాసన్ పార్టీ పోటీ
దేశంలోని అత్యుత్తమ నటుల్లో ఒకరైన కమల్ హాసన్ తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటున్నారు. తను స్థాపించిన ఎంఎన్ఎం (మక్కల్ నీది మయ్యం) పార్టీని తమిళనాడు లోక్సభ ఎన్నికల బరిలో నిల్పుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 39 సీట్లలో తన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు.
ఈ నెల 20న పార్టీ అభ్యర్థుల్ని ఆయన ప్రకటించనున్నారు. ఆయన సైతం స్వయంగా పోటీలో నిలవబోతున్నారు. చెన్నై నగరంలోని ఎదో ఒక సీటు నుంచి ఆయన పోటీ చేయనున్నారు. తన స్వగ్రామం పరమకూడి ఉన్న రామనాథపురం నుంచి కానీ, సౌత్ చెన్నై నుంచి కానీ ఆయన పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వినిపిస్తోంది. 20న దీనిపై స్పష్టత రానున్నది.
ఆయన పార్టీకి ఎన్నికల కమిషన్ టార్చి లైట్ (బ్యాటరీ టార్చ్)ను ఎన్నికల చిహ్నంగా కేటాయించింది. తమిళనాడులో ఏప్రిల్ 18న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఏఐడీఎంకే, డీఎంకే వంటి పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. ఎంఎన్ఎం ఏ ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా స్వతంత్రంగా పోటీలో నిలవనున్నది.
లోక్సభ ఎన్నికలు: అన్ని సీట్లలోనూ కమల్ హాసన్ పార్టీ పోటీ | actioncutok.com
You may also like: