కీర్తికి బంపర్ ఛాన్స్!


కీర్తికి బంపర్ ఛాన్స్!

కీర్తికి బంపర్ ఛాన్స్!

కీర్తి సురేశ్ సూపర్ ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవ్‌గణ్ జోడీగా వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా చేజిక్కించుకుంది. అవును. ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా రూపొందే సినిమాలో ప్రధాన పాత్రను అజయ్ దేవ్‌గణ్ పోషించేందుకు సిద్ధమవుతున్నాడు.

‘బధాయీ హో’ ఫేం అమిత్ శర్మ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో దేవ్‌గణ్ జోడీగా నటించే తార కోసం చేసిన అన్వేషణలో కీర్తి సరైన నటి అని నిర్ధారించుకున్నాడు అమిత్. ‘మహానటి’లో సావిత్రిగా అమే ప్రదర్శించిన అభినయం అతడిని ముగ్ధుడ్ని చేసింది. అజయ్ దేవ్‌గణ్ సైతం వెంటనే కీర్తి ఎంపికకు ఓకే చెప్పేశాడు.

ఈ సినిమా ఒక సంప్రదాయ ప్రేమకథా చిత్రమనీ, కీర్తి పోషించే పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందనీ అంతర్గత వర్గాలు తెలిపాయి. బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న తార కావాలని అమిత్ భావించాడనీ, కీర్తి కచ్చితంగా ఆ పాత్రకు న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఆమెను ఎంపిక చేశాడనీ ఆ వర్గాలు చెప్పాయి. ఇప్పటికే ఈ సినిమాకి కీర్తి సంతకం చేసింది. అబ్దుల్ రహీం భార్యగా ఆమె కనిపించనున్నది.

‘టోటల్ ధమాల్’ సక్సెస్‌లో ఉన్న దేవ్‌గణ్ ప్రస్తుతం ‘తానాజీ: ది అన్‌సంగ్ వారియర్’ సినిమా చేస్తున్నాడు. అది పూర్తవగానే అబ్దుల్ రహీం బయోపిక్ చేయనున్నాడు.

కీర్తికి బంపర్ ఛాన్స్! | actioncutok.com

You may also like: