కార్గిల్ వీరుడి బయోపిక్‌లో కియారా!


కార్గిల్ వీరుడి బయోపిక్‌లో కియారా!

కార్గిల్ వీరుడి బయోపిక్‌లో కియారా! – actioncutok.com

తెలుగులో ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నాయికగా నటించిన లావణ్యరాశి కియారా అద్వానీ మళ్లీ మరో తెలుగు సినిమాకు ఇంతవరకూ సంతకం చెయ్యలేదు. మరోవైపు బాలీవుడ్‌లో ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’లో నాయికగా నటిస్తోన్న ఆమె ‘గుడ్ న్యూస్’లో దిల్జీత్ దోసాంజ్ సరసన చేస్తోంది. త్వరలో రాబోతున్న కరణ్ జోహార్ సినిమా ‘కళంక్’లో అతిథి పాత్ర చేసింది.

ఇప్పుడు మరో సినిమాలో నటించేందుకు సిద్ధమవుతోంది. కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన విక్రమ్ బాత్రా బయోపిక్‌లో నాయికగా ఆమె నటించబోతోంది. ‘కార్గిల్: షేర్ షా’ (వర్కింగ్ టైటిల్) పేరుతో రూపొందే ఆ సినిమాలో టైటిల్ రోల్‌ను సిద్ధార్థ్ మల్హోత్రా చేయనున్నాడు. అంతే కాదు, విక్రమ్ కవల సోదరుడు విశాల్ కేరెక్టర్‌నూ సిద్ధార్థ్ చేయనుండటం గమనార్హం.

తమిళ దర్శకుడు, తెలుగులో పవన్ కల్యాణ్‌తో ‘పంజా’ చిత్రాన్ని రూపొందించిన విష్ణువర్ధన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు. ‘బిల్లా’ డైరెక్టర్‌గా ఫేమస్ అయిన అతనికి ఇదే తొలి బాలీవుడ్ ఫిల్మ్. కరణ్ జోహార్, షబ్బీర్ బాక్స్‌వాలా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తోంది.

కార్గిల్ వీరుడి బయోపిక్‌లో కియారా! – actioncutok.com

You may also like: