చైతూను సమంత హిట్ ట్రాక్‌లోకి తెస్తుందా?


చైతూను సమంత హిట్ ట్రాక్‌లోకి తెస్తుందా?

చైతూను సమంత హిట్ ట్రాక్‌లోకి తెస్తుందా?

కల్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో చేసిన ‘రారాండోయ్ వేడుక చూద్దాం’ (2017) సినిమా తర్వాత నాగచైతన్యకు మళ్లీ హిట్ రాలేదు. వరుసగా మూడు ఫ్లాపులతో అతని మార్కెట్ డౌన్ అయింది. ‘శైలజారెడ్డి అల్లుడు’ ఫ్లాప్ కాగా, ‘యుద్ధం శరణం’, ‘సవ్యసాచి’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అతను ‘మజిలీ’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

ఈ సినిమా తనను ఫ్లాపుల నుంచి బయట పడేస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు చైతన్య. ఇందులో తన నిజ జీవిత భాగస్వామి సమంతతో కలిసి నటించాడు. పెళ్లికి ముందు కలిసి మూడు సినిమాలు చేసినవాళ్లకు రెండు హిట్లు – ‘ఏ మాయ చేశావే’, ‘మనం’ – ఉన్నాయి. ‘ఆటోనగర్ సూర్య’ ఒక్కటి ఫ్లాపయింది.

పెళ్లి తర్వాత కలిసి చేస్తున్న తొలి సినిమా కావడంతో సెంటిమెంట్‌గానూ చైతన్య ఫీలవుతున్నాడు. చరిత్రనోసారి తిరగేస్తే నిజ జీవిత జంటలు తెర జంటలుగా కనిపిస్తే ప్రేక్షకులు ఏమంత ఆసక్తి చూపించలేదని అర్థమవుతుంది. దాన్ని ‘మజిలీ’తో బ్రేక్ చెయ్యాలని చైతూ ఆశిస్తున్నాడు.

డైరెక్టర్ శివ నిర్వాణ ఎలా తీశాడనే దానిపైనే ‘మజిలీ’ విజయావకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయనేది నిజం. అతను రూపొందించిన ‘నిన్ను కోరి’ బాగానే ఆడినా, కథనం నెమ్మదిగా ఉందనే పేరొచ్చింది. ‘మజిలీ’లో ఆ లోపం లేకుండా చూసుకొని ఉంటే మాత్రం విజయం తథ్యమని చెప్పొచ్చు. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదలవుతోంది.

చైతూను సమంత హిట్ ట్రాక్‌లోకి తెస్తుందా? | actioncutok.com

You may also like: