ఏప్రిల్‌లో మలైకా, అర్జున్ కపూర్ పెళ్లి?


ఏప్రిల్‌లో మలైకా, అర్జున్ కపూర్ పెళ్లి?

మధ్య వయస్కురాలైన మలైకా అరోరా (45), యువకుడైన అర్జున్ కపూర్ (33) మధ్య అనుబంధం కొంత కాలంగా వార్తల్లో నలుగుతూ వస్తోంది. ఆ ఇద్దరూ సినిమా వేడుకల్లో జంటగా కనిపించారు. డిన్నర్ డేట్స్ సంగతి సరే సరి.

తాజాగా ఆ ఇద్దరూ త్వరలో పెళ్లాడబోతున్నారని బాలీవుడ్‌లో జోరుగా ప్రచారమవుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్లు గానే వాళ్లు ముంబైలోని సంపన్న వర్గాల నివాస ప్రాంతమైన లోఖండ్‌వాలాలో ఒక అపార్ట్‌మెంట్ సైతం కొన్నారు.

తాజా సమాచారం ప్రకారం, తమ అనుబంధాన్ని పెళ్లిబంధంతో ముడివేయాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. ఏప్రిల్లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఆ ఇద్దరూ ఒక్కటవనున్నారని వినిపిస్తోంది. అర్జున్ ప్రస్తుతం అశుతోష్ గోవరికర్ సినిమా ‘పానిపట్’లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

మలైకా ఇదివరకు నటుడు, దర్శకుడు అర్బాజ్ ఖాన్ (సల్మాన్ ఖాన్ సోదరుడు)ను వివాహం చేసుకుంది. ఆ ఇద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు. వాళ్లకు అర్హాన్ అనే కొడుకు ఉన్నాడు.