‘ఐరా’ భారీ విడుద‌ల‌కు స‌ర్వం స‌న్న‌ద్ధం!


న‌య‌న‌తార ద్విపాత్రాభిన‌యం చేసిన‌ చిత్రం 'ఐరా'
భారీ విడుద‌ల‌కు స‌ర్వం స‌న్న‌ద్ధం!

న‌య‌న‌తార ద్విపాత్రాభిన‌యం చేసిన‌ చిత్రం ‘ఐరా’
భారీ విడుద‌ల‌కు స‌ర్వం స‌న్న‌ద్ధం!

‘అంద‌రికీ సంతోషంగా బ‌త‌క‌డం ఒక క‌ల‌. కానీ జీవితంలో సంతోషం అంటే ఏంటో తెలియ‌ని నాకు బ‌త‌క‌డమే ఒక క‌ల‌.. అని మా ‘ఐరా’ టీజ‌ర్‌లో వినిపించే డైలాగులు అంద‌రిలోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి’ అని న‌య‌న‌తార తెలిపారు. ఆమె క‌థానాయిక‌గా న‌టించిన  ‘ఐరా’ ఈ నెల 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. స‌ర్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో న‌య‌న‌తార తొలిసారిగా ద్విపాత్రాభిన‌యం చేశారు.  గంగా ఎంట‌ర్‌టైన్మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ‘న‌య‌న‌తార లేడీ ఓరియంటెడ్ స‌బ్జెక్ట్ ఓకే చేశార‌ని తెలియ‌గానే ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో ఆ ప్రాజెక్ట్ మీద ఆస‌క్తి మొద‌ల‌వుతుంది. అలా మా ‘ఐరా’కు ముందు నుంచే హైప్ క్రియేట్ అయ్యింది. ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ హార‌ర్ చిత్రంగా మా దర్శ‌కుడు మ‌లిచారు. ఇందులో భ‌వాని, య‌మున పాత్ర‌ల్లో ఆమె న‌ట‌న హైలైట్‌గా ఉంటుంది. భ‌వానీ పాత్ర కోసం ఆమె వేసుకున్న మేక‌ప్ కూడా ప్రేక్ష‌కుల‌కు ఇప్ప‌టికే న‌చ్చింది. ఈ నెల 28న అత్యంత భారీగా, ప్ర‌తిష్టాత్మ‌కంగా మా చిత్రాన్ని 300ల‌కు పైగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నాం’ అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ‘మా సినిమా త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నూ ఆక‌ట్టుకుంటుంది. హార‌ర్‌, థ్రిల్ల‌ర్ అంశాల‌తో పాటు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసే భావోద్వేగాలుంటాయి. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ హార‌ర్ చిత్రం ‘ఐరా’. ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లో లోతైన భావోద్వేగాల‌ను న‌య‌న‌తార ప‌లికించిన తీరుకు అంద‌రూ ముగ్ధుల‌వుతారు.  ‘ఐరా’ అనే పేరుకు త‌గ్గ‌ట్టే సినిమా కూడా స్ట్రాంగ్ కంటెంట్‌తో అల‌రిస్తుంది’ అని అన్నారు.

న‌టీన‌టులు..
కళైయ‌ర‌సి,  యోగిబాబు, మ‌నోబాలా, ఎం.ఎస్‌.భాస్క‌ర్‌, వంశీకృష్ణ‌, ప్ర‌వీణ్ రంగ‌నాథ‌న్‌, జ‌య‌ప్ర‌కాష్‌, లీలావ‌తి, కృష్ణ అభిషేక్‌, ర‌వి ప్ర‌కాష్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు..
కెమెరా:  సుద‌ర్శ‌న్ శ్రీనివాస‌న్‌,
కూర్పు:  కార్తిక్ జోగేష్‌,
స్క్రీన్‌ప్లే:  ప్రియాంక ర‌వీంద్ర‌న్‌
సంగీతం:  సుంద‌రమూర్తి. కె.ఎస్‌

న‌య‌న‌తార ద్విపాత్రాభిన‌యం చేసిన‌ చిత్రం 'ఐరా'
భారీ విడుద‌ల‌కు స‌ర్వం స‌న్న‌ద్ధం!

న‌య‌న‌తార ద్విపాత్రాభిన‌యం చేసిన‌ చిత్రం ‘ఐరా’
భారీ విడుద‌ల‌కు స‌ర్వం స‌న్న‌ద్ధం! | actioncutok.com

You may also like: